Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- ఈ 3 స్టాక్స్‌ని ట్రాక్ చేయండి..
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
గురునానక్ జయంతి కారణంగా గత శుక్రవారం స్టాక్ మార్కెట్లకు సెలవు. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 111 పాయింట్లు పడి 77,580 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 26పాయింట్లు కోల్పోయి 23,533 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 91 పాయింట్లు పెరిగి 50,180 వద్దకు చేరింది.
“నిఫ్టీ50లో డోజీ తరహా క్యాండిల్ పాటర్న్ ఏర్పడింది. కానీ క్లాసిక్ డోజీ కాదు. సాధారణంగా, సహేతుకమైన క్షీణత తర్వాత లేదా కీ సపోర్ట్ దగ్గర వచ్చే ఇటువంటి డోజీ క్యాండిల్.. తర్వాత రాబోయే తిరోగమన సంకేతాలను సూచిస్తుంది. నిఫ్టీ 50 ఇప్పుడు కీలకమైన 200 రోజుల ఈఎంఏ (ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్) కంటే 23,540 దిగువన ఉంది. రానున్న సెషన్లు కీలకంగా మారింది," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి అన్నారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1849.87 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2481.81 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
నవంబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 29,533.17 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 26,522.32 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 105 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. డౌ జోన్స్ 0.7శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 1.3శాతం పతనమైంది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.24శాతం పడింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సైతం సోమవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ : రూ.741కే కొనొచ్చు. రూ.750 టార్గెట్.. స్టాప్ లాస్ రూ.725.
బయోకాన్ లిమిటెడ్ (బయోకాన్): రూ.335కు కొనండి. రూ.360 టార్గెట్.. స్టాప్ లాస్ రూ.320.
డీఎల్ఎఫ్ లిమిటెడ్( డీఎల్ఎఫ్): రూ.762కే కొనొచ్చు. లక్ష్యం రూ.785. రూ.740 వద్ద స్టాప్ లాస్.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం