Stocks to buy today : ఈ రూ. 130 స్టాక్‌లో బుల్ రన్ మొదలైంది- షార్ట్ టర్మ్‌లో భారీ లాభాలు!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : బక్రీద్ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లకు సోమవారం సెలవు. మూడు రోజుల వరుస సెలవు అనంతరం దేశీయ సూచీలు మంగళవారం తిరిగి ఓపెన్ అవ్వనున్నాయి. ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 182 పాయింట్లు పెరిగి 76,993 వద్ద స్థిరపడింది. నిఫ్టీ.. 67 పాయింట్ల లాభంతో 23,466 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ.. 155 పాయింట్ల లాభంతో 50,002 వద్ద ఓపెన్ అయ్యింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రెండ్.. రేంజ్ బౌండ్గానే ఉంది. ఎటూ బ్రేకౌట్ కనిపించడం లేదు. 23,500 లెవల్స్ వద్ద బలమైన రెసిస్టెన్స్ ఉంది. 23,300 వద్ద సపోర్ట్ ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి బ్రేక్ అయితే.. మంచి మూవ్మెంట్ కనిపించొచ్చు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
Stock market news today : మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2175.86 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు సైతం రూ. 655.76 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 145 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
ఇదీ చూడండి:- Government employees : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ మీద షాక్ ఇచ్చిన కేంద్రం.. ఆ రెండు విషయాల్లో!
అమెరికా స్టాక్ మార్కెట్లు..
US Stock market updates : సోమవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.49శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.77శాతం, నాస్డాక్ 0.95శాతం మేర పెరిగాయి.
స్టాక్స్ టు బై..
Stocks to buy : టీవీఎస్ మోటార్:- బై రూ. 2504, స్టాప్ లాస్ రూ. 2410, టార్గెట్ రూ. 2650
టిమ్కెన్ ఇండియా:- బై రూ. 4579.35, స్టాప్ లాస్ రూ. 4415, టార్గెట్ రూ. 4850
బిర్లా కార్పొరేషన్:- బై రూ. 1575, స్టాప్ లాస్ రూ. 1520, టార్గెట్ రూ. 1650
పంజాబ్ నేషనల్ బ్యాంక్:- బై రూ. 129, స్టాప్ లాస్ రూ. 124, టార్గెట్ రూ. 135
ITC share price target : ఐటీసీ:- బై రూ. 431, స్టాప్ లాస్ రూ. 425, టార్గెట్ రూ. 440
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం