Stocks to buy today : ట్రేడర్స్‌కి గుడ్ ఛాన్స్! మారుతీ సుజుకీ షేర్ ప్రైజ్ టార్గెట్ ఇదే..
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 58 పాయింట్లు పెరిగి 75,997 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 30 పాయింట్లు వృద్ధిచెంది 22,959 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 159 పాయింట్లు పెరిగి 49,259 వద్దకు చేరింది.
“నిఫ్టీ50 22800 లెవల్స్ కన్నా పైన ఉన్నంత కాలం పుల్‌బ్యాక్ ఫార్మేషన్ని చూడవచ్చు. నిఫ్టీ50 23000 వరకు వెళ్లొచ్చు. 22725-22650 లెవల్స్ వద్ద సపోర్ట్ ఉంది,” అని కొటాక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
దేశీయ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐలు సెల్లింగ్ కొనసాగుతోంది. సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3937.83 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4759.77 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఫిబ్రవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 33,121.26 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 30,778.84 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ జయంతి నేపథ్యంలో అక్కడి స్టాక్ మార్కెట్లకు సోమవారం సెలవు.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
విష్ణు కెమికల్స్- బై రూ. 474.45, స్టాప్ లాస్ రూ. 460, టార్గెట్ రూ. 510
శారదా ఎనర్జీ అండ్ మినరల్స్- బై రూ. 480.65, స్టాప్ లాస్ రూ. 465, టార్గెట్ రూ. 515
బజాజ్ ఫైనాన్స్- బై రూ .8427, స్టాప్ లాస్ రూ. 8250, టార్గెట్ రూ. 8600
ఇండస్ ఇండ్ బ్యాంక్- బై రూ. 1048, స్టాప్ లాస్ రూ. 1028, టార్గెట్ రూ. 1070
సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్- బై రూ .583, స్టాప్ లాస్ రూ. 565, టార్గెట్ రూ. 610
మారుతీ సుజుకీ- బై రూ. 12760, స్టాప్ లాస్ రూ. 12500, టార్గెట్ రూ. 13200
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం