Stocks to buy today : రూ. 200 దగ్గర ఉన్న ఈ స్టాక్ కొంటే.. షార్ట్ టర్మ్‌లో భారీ లాభాలు!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ను లభాలతో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 307 పాయింట్లు పెరిగి 65,982 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 90 పాయింట్ల లాభంతో 19,765 వద్ద ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 40 పాయింట్ల నష్టంతో 44,162 వద్దకు చేరింది.
ట్రెండింగ్ వార్తలు
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ అప్‌ట్రెండ్‌లో ఉంది.
"నిఫ్టీ డైలీ ఛార్ట్‌లో అప్‌ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. గురువారం సెషన్లో ముఖ్యమైన రెసిస్టెన్స్ నుంచి కిందకు పడింది. రానున్న సెషన్స్‌లో కన్సాలిడేషన్ లేదా మైనర్ వీక్నెస్ కనిపించొచ్చు. 19,650- 19,550 లెవల్స్ సపోర్ట్‌గా ఉన్నాయి," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
Stock market news today : దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 957.25 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 705.65 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ సూచీలు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ను ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల డౌన్లో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
అమెరికా సూచీలు గురువారం ట్రేడింగ్ సెషన్‌ను ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.13శాతం నష్టపోయింది. ఎస్ అండ్పీ 500 0.12శాతం, నాస్డాక్ 0.07శాతం మేర లాభపడ్డాయి.
స్టాక్స్ టు బై..
HCL technologies share price target : హెచ్‌సీఎల్ టెక్నాలజీస్:- బై రూ. 1311, స్టాప్ లాస్ రూ. 1260, టార్గెట్ రూ. 1410
ఎస్కార్ట్స్:- బై రూ. 3186.75, స్టాప్ లాస్ రూ. 3120, టార్గెట్ రూ. 3340
సైయంట్:- బై రూ. 1715, స్టాప్ లాస్ రూ. 1680, టార్గెట్ రూ. 1755
ఫినోలెక్స్ ఇండస్ట్రిస్:- బై రూ. 203, స్టాప్ లాస్ రూ. 197, టార్గెట్ రూ. 210
NTPC share price target : ఎన్టీపీసీ:- బై రూ. 251- రూ. 251.5, స్టాప్ లాస్ రూ. 245, టార్గెట్ రూ. 262
డాబర్ ఇండియా:- బై రూ. 533- రూ. 535, స్టాప్ లాస్ రూ. 515, టార్గెట్ రూ. 570
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం