Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్- ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​ ట్రాక్​ చేస్తే లాభాలకు ఛాన్స్​!-stocks to buy today 17th feb 2025 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్- ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​ ట్రాక్​ చేస్తే లాభాలకు ఛాన్స్​!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్- ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​ ట్రాక్​ చేస్తే లాభాలకు ఛాన్స్​!

Sharath Chitturi HT Telugu
Published Feb 17, 2025 08:10 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 200 పాయింట్లు పడి 75,939 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 102 పాయింట్లు పడి 22,929 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 260 పాయింట్లు నష్టపోయి 49,099 వద్దకు చేరింది.

“నిఫ్టీ50 ప్రస్తుతం వీక్​గా ఉంది. 22,800 వద్ద సపోర్ట్​ ఉంది. అది కూడా బ్రేక్​ అయితే నిఫ్టీ50 22,600- 22,500 వద్దకు వెళ్లొచ్చు. 23,000 వద్ద కీలక రెసిస్టెన్స్​ ఉంది. అది దాటితే 23,200- 23,300 వద్దకు నిఫ్టీ50 వెళ్లొచ్చు,” అని కొటాక్​ సెక్యూరిటీస్​ వీపీ- టెక్నికల్​ రీసెర్చ్​ అమోల్​ అథవాలే తెలిపారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

దేశీయ స్టాక్​ మార్కెట్​లో ఎఫ్​ఐఐలు సెల్లింగ్​ కొనసాగుతోంది. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4294.69 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4363.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఫిబ్రవరి నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 29,183.43 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 26,019.07 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని స్వల్ప నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 35 పాయింట్ల లాభంలో నష్టంలో ఉండం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.37 శాతం పడింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.01శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.41 శాతం వృద్ధిచెందింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

బేయర్​ క్రాప్​సైన్సెస్​- బై రూ. 4490.5, స్టాప్​ లాస్​ రూ. 4,333, టర్గెట్​ రూ. 4805

త్రివేణీ ఇంజినీరింగ్​ అండ్​ ఇండస్ట్రీస్​- బై రూ. 370.85, స్టాప్​ లాస్​ రూ. 357, టార్గెట్​ రూ. 399

చాలెట్​ హాస్పిటల్స్​- బై రూ. 693.65, స్టాప్​ లాస్​ రూ. 678, టార్గెట్​ రూ. 735

గ్లాసోస్మిత్​క్లైన్​ ఫార్మా- బై రూ. 2018, స్టాప్​ లాస్​ రూ. 1970, టార్గెట్​ రూ. 2130

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

నీతిరాజ్ ఇంజనీర్స్​: రూ.272.95 వద్ద కొనండి, టార్గెట్ రూ.295, స్టాప్ లాస్ రూ.260;

టీసీపీఎల్ ప్యాకేజింగ్: రూ .3484.75 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .3750, స్టాప్ లాస్ రూ .3350;

విమతా ల్యాబ్స్: రూ.1118.75 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1200, స్టాప్ లాస్ రూ.1080;

కార్​ట్రేడ్ టెక్: రూ.1567.8 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1670, స్టాప్ లాస్ రూ.1510;

ఎంపీఎస్​: రూ .2685.85 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .2880, స్టాప్ లాస్ రూ .2600.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం