Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్.. ఈ రూ. 390 స్టాక్‌ని ట్రాక్ చేయండి- భారీ లాభాలు!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 680 పాయింట్లు పెరిగి 73,664 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 203 పాయింట్లు వృద్ధిచెంది 22,404 వద్ద ముగిసింది. ఇక 290 పాయింట్ల పెరిగిన బ్యాంక్ నిఫ్టీ.. 47,977 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. లోక్‌సభ ఎన్నికల అనిశ్చితి కారణంగా స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు కనిపిస్తున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడేంతవరకు మదుపర్లు కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు మరో రూ. 776.49 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2127.81 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
Stock market news today : గత కొన్ని రోజులుగా ఎఫ్ఐఐలు ఇండియన్ స్టాక్ మార్కెట్లో సెల్ చేస్తున్నారు. ఈ నెలలో ఇప్పటికే రూ. 37,149.26 కోట్లు విలువ చేసే షేర్లను అన్లోడ్ చేశారు. గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లలో కనిపిస్తున్న తీవ్ర ఒడుగొడుకులకు ఇదీ ఒక కారణం.
అదే సమయంలో డీఐఐలు ఈ ఒక్క నెలలో ఇప్పటివరకు రూ. 32,416.8 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.1శాతం, ఎస్ అండ్ పీ 500 0.21శాతం మేర నష్టపోయాయి. నాస్డాక్ 0.26శాతం నష్టాల్లో ముగిసింది.
స్టాక్స్ టు బై..
Stocks to buy : వెల్స్పన్- బై రూ. 392.7, స్టాప్ లాస్ రూ. 377, టార్గెట్ రూ. 415
త్రివేణి టర్బైన్- బై రూ. 605, స్టాప్ లాస్ రూ. 584, టార్గెట్ రూ. 644
చంబల్ ఫర్టిలైజర్- బై రూ. 404, స్టాప్ లాస్ రూ. 392, టార్గెట్ రూ. 422
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్- బై రూ. 590, స్టాప్ లాస్ రూ. 575, టార్గెట్ రూ. 615
పవర్ గ్రిడ్ కార్పొరేషన్- బై రూ. 312, స్టాప్ లాస్ రూ. 304, టార్గెట్ రూ. 328
ఛాలెట్ హోటల్స్- బై రూ. 789, స్టాప్ లాస్ రూ. 767, టార్గెట్ రూ. 824
హెచ్‌సీసీ- బై రూ. 36.25, స్టాప్ లాస్ రూ. 35, టార్గెట్ రూ. 39
ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్- బై రూ. 653, స్టాప్ లాస్ రూ. 638, టార్గెట్ రూ. 682
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం