Stocks to buy today : ఈ రూ. 750 స్టాక్‌ని ట్రాక్ చేస్తే, షార్ట్ టర్మ్‌లో మంచి లాభాలు!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 146 పాయింట్లు పెరిగి 80,665 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 85 పాయింట్లు పెరిగి 24,587 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 52,456 వద్దకు చేరింది.
నిఫ్టీకి సంబంధించిన అవుట్‌లుక్‌పై హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి మాట్లాడుతూ.. “24,400 లెవల్స్ (1.618% ఫిబోనాకీ పొడిగింపు) రెసిస్టెన్స్‌ని అధిగమించిన నిఫ్టీ వచ్చే వారంలో 24,950 వైపు మరింత పుంజుకునే అవకాశం ఉంది. నిఫ్టీకి సపోర్ట్ 24,450 వద్ద ఉంది,” అని అన్నారు.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం బ్యాంక్‌నిఫ్టీ 51,750 దిగువకు పడితే బలహీనపడుతుంది. అప్పటివరకు పాజిటివ్ ట్రెండ్‌లోనే కొనసాగుతున్నట్టు అవుతుంది. 52,800 లెవల్ రెసిస్టెన్స్‌గా ఉంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2684.78 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 331 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 13403.43 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ. 4674.38 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
క్యూ1 ఫలితాలు 2024
23 లిస్టెడ్ కంపెనీలు నేడు తమ క్యూ1 ఫలితాలను ప్రకటించనున్నాయి. వీటిలో బజాజ్ ఆటో, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, క్రిసిల్, అలోక్ ఇండస్ట్రీస్, జుబిలెంట్ ఇంగ్రేవియా, జస్ట్ డయల్, ఆగ్రో టెక్ ఫుడ్స్, బీఎండబ్ల్యూ ఇండస్ట్రీస్, ఆదిత్య బిర్లా మనీ తదితర కంపెనీలు ఉన్నాయి.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమువారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.53శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.28శాతం వృద్ధిచెందింది. నాస్డాక్ 0.40శాతం పెరిగింది.
స్టాక్స్ టు బై..
యూటీఐ ఏఎంసీ: రూ .1077 వద్ద కొనండి, టార్గెట్ రూ .1130, స్టాప్ లాస్ రూ.1040.
ఓఎఫ్ఎస్ఎస్: రూ.10922.75, టార్గెట్ రూ.11500, స్టాప్ లాస్ రూ.10555.
మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్: రూ.1037 వద్ద కొనండి, టార్గెట్ రూ.1080, స్టాప్ లాస్ రూ.1010.
కెఫిన్ టెక్నాలజీస్: రూ.756 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.785, స్టాప్ లాస్ రూ.735
బజాజ్ ఆటో: రూ .9675 వద్ద కొనండి, టార్గెట్ రూ .9950, స్టాప్ లాస్ రూ .9500
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం