Stocks to buy today : ఆల్​ టైమ్​ హై వద్ద నిఫ్టీ- ఈ స్టాక్స్​ ఇప్పుడు కొంటే భారీ లాభాలు-stocks to buy today 16th january 2024 sensex and nifty at all time high ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ఆల్​ టైమ్​ హై వద్ద నిఫ్టీ- ఈ స్టాక్స్​ ఇప్పుడు కొంటే భారీ లాభాలు

Stocks to buy today : ఆల్​ టైమ్​ హై వద్ద నిఫ్టీ- ఈ స్టాక్స్​ ఇప్పుడు కొంటే భారీ లాభాలు

Sharath Chitturi HT Telugu
Jan 16, 2024 09:13 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 4 పాయింట్లు పెరిగి 73,332 వద్ద మొదలైంది. ఇక ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 17 పాయింట్ల నష్టంతో 22080 వద్ద ఓపెన్​ అయ్యింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. దేశీయ సూచీలు అప్​ట్రెండ్​లో దూసుకెళుతున్నాయి.

"నిఫ్టీ పాజిటివ్​గా ఉంది. ఇక్కడి నుంచి నిఫ్టీ ఇంకా పెరిగితే.. 22,200- 22,300 వరకు వెళ్లొచ్చు. 22,000 వద్ద సపోర్ట్​ ఉంది. అయితే.. 21900 వద్ద ఏర్పడిన గ్యాప్​ ఫిల్​ అవుతుందా? లేదా? చూడాలి," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

లాభాలు.. నష్టాలు..

సన్​ఫార్మా, మారుతీ, నెస్లే, ఎయిర్​టెల్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, అల్ట్రాటెక్​ సిమెంట్​, హెచ్​సీఎల్​ టెక్​, టాటా మోటర్స్​, విప్రో, ఐటీసీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, పవర్​ గ్రిడ్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఐసీఐసీఐ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, టెక్​ఎం, ఇన్ఫీ, టాటా స్టీల్​, రిలయన్స్​, ఏషియన్​ ​పెయింట్స్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1085.72 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 820.69 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

Stock market news today : అమెరికా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.31శాతం మేర నష్టపోగా.. ఎస్​ అండ్​ పీ 500 0.08శాతం, నాస్​డాక్​ 0.02శాతం మేర లాభపడ్డాయి.

స్టాక్స్​ టు బై..

శ్రీరామ్​ ఫైనాన్స్:- బై రూ. 2316.2, స్టాప్​ లాస్​ రూ. 2292, టార్గెట్​ రూ. 2388

ఎస్​జీవీఎన్​:- బై రూ. 102.6, స్టాప్​ లాస్​ రూ. 98.7, టార్గెట్​ రూ. 107.8

Stocks to buy : జిందాల్​ స్టీల్​ అండ్​ పవర్​:- బై రూ. 736, స్టాప్​ లాస్​ రూ. 725, టార్గెట్​ రూ. 765

డాబర్​ ఇండియా:- బై రూ. 554, స్టాప్​ లాస్​ రూ. 545, టార్గెట్​ రూ. 570

మెజగాన్​ డాక్​ షిప్​బిల్డర్స్​:- బై రూ. 21950 రూ. 2200, స్టాప్​ లాస్​ రూ. 2141, టార్గెట్​ రూ. 2270

జేకే పేపర్​:- బై రూ. 409- రూ. 411, స్టాప్​ లాస్​ రూ. 400, టార్గెట్​ రూ. 430​

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం