Stocks to buy today : స్టాక్స్​ టు బై ఈ రూ. 250 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!-stocks to buy today 15th july 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : స్టాక్స్​ టు బై ఈ రూ. 250 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Stocks to buy today : స్టాక్స్​ టు బై ఈ రూ. 250 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Sharath Chitturi HT Telugu
Jul 15, 2024 09:00 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై టుడే
స్టాక్స్​ టు బై టుడే

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 622 పాయింట్లు పెరిగి 80,519 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 186 పాయింట్లు పెరిగి 24,502 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 8 పాయింట్లు పెరిగి 52,278 వద్దకు చేరింది.

yearly horoscope entry point

భారత స్టాక్ మార్కెట్ అవుట్​లుక్​పై సుమీత్ బగాడియా మాట్లాడుతూ, నిఫ్టీ 50 ఇండెక్స్ కన్సాలిడేషన్ దశ నుంచి బయటకు వచ్చిందని, 50 స్టాక్ ఇండెక్స్ సమీపకాలంలో 24,900ను తాకే అవకాశం ఉందని అన్నారు. భారత ఐటీ దిగ్గజాలు టీసీఎస్, హెచ్​సీఎల్ టెక్నాలజీస్ బలమైన క్యూ1ఎఫ్వై25 ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో బుల్స్ సెంటిమెంట్లు సానుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. భారత స్టాక్ మార్కెట్ క్రమం తప్పకుండా కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని, ఈ బుల్ ట్రెండ్ లో ఇన్వెస్టర్లు ఆకర్షితులయ్యే అవకాశం ఉందని బగాడియా అన్నారు

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4021.6 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1651.45 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ఎఫ్​ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 10718.65 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ. 5005.38 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.62శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.55శాతం వృద్ధిచెందింది. నాస్​డాక్​ 0.63శాతం మేర పెరిగింది.

స్టాక్స్​ టు బై లిస్ట్​..

వినాయక ఎకోస్పియర్: రూ.1557 వద్ద కొనండి, టార్గెట్ రూ.1630, స్టాప్ లాస్ రూ.1500.

ఐఆర్ఎఫ్సీ: రూ.217.45, టార్గెట్ రూ.229, స్టాప్ లాస్ రూ.209.50.

బ్యాంక్ ఆఫ్ బరోడా: 250, టార్గెట్ రూ.265, స్టాప్​ లాస్​ రూ.240.

ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్: రూ.780 వద్ద కొనండి, టార్గెట్ రూ.820, స్టాప్ లాస్ రూ.760.

ఇండస్ టవర్: రూ.392 వద్ద కొనండి, టార్గెట్ రూ.412, స్టాప్ లాస్ రూ.382.

బ్రేకౌట్​ స్టాక్స్​ లిస్ట్​..

1] రైల్ టెల్: రూ.597 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.630, స్టాప్ లాస్ రూ.575;

2. ఐఆర్ఎఫ్సీ: రూ.69.60 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.73.50, స్టాప్ లాస్ రూ.67;

3. హెచ్​పీఎల్: రూ.633.25 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.666, స్టాప్ లాస్ రూ.610;

4] కాంటాబిల్: రూ.290.65 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.305, స్టాప్ లాస్ రూ.280;

5] సోనాటా సాఫ్ట్​వేర్: రూ.710.50 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.745, స్టాప్ లాస్ రూ.685.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం