సోమవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1049 పాయింట్లు పడి 76,330 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 346 పాయింట్లు కోల్పోయి 23,086 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 693 పాయింట్లు పడి 48,041 వద్దకు చేరింది.
“నిఫ్టీ50.. నవంబర్ 2024 కనిష్ట స్థాయి 23,263.15 దిగువకు పడిపోయింది. వోలటైల్ ఇండెక్స్‌లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. తదుపరి ముఖ్యమైన సపోర్ట్ 22,700 స్థాయిలో ఉంద,” అని ఎస్విపి, రీసెర్చ్, రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ అజిత్ మిశ్రా చెప్పారు.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4892.84 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 8066.07 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
రూపాయి పతనం, అమెరికాలో బాండ్ యూల్డ్స్ వృద్ధి, ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై అనిశ్చితి వంటి కారణాలతో గత కొన్ని రోజులుగా భారత స్టాక్ మార్కెట్లలో ఎఫ్ఐఐలు విపరీతంగా అమ్మకాలు చేస్తున్నారు. అందుకే సూచీలు పడుతున్నాయి.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 120 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.8శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.16శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.38శాతం పడింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)- బై రూ. 4291.10, స్టాప్ లాస్ రూ. 4140, టార్గెట్ రూ. 4591
గుఫిక్ బయోసైన్స్- బై రూ. 476.55, స్టాప్ లాస్ రూ. 460, టార్గెట్ రూ. 510
హిందుస్థాన్ యూనీలివర్- బై రూ. 2445, స్టాప్ లాస్ రూ. 2440, టార్గెట్ రూ. 2520
ఇన్పోసిస్- బై రూ. 1960, స్టాప్ లాస్ రూ. 1925, టార్గెట్ రూ. 2010
ఏషియన్ పెయింట్స్- బై రూ. 2250, స్టాప్ లాస్ రూ. 2215, టార్గెట్ రూ. 2350
మధ్యభారత్ ఆగ్రో ప్రొడక్ట్స్: రూ.256.70 వద్ద కొనండి, టార్గెట్ రూ.275, స్టాప్ లాస్ రూ.247;
పిరమల్ ఫార్మా: రూ.232.65 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.250, స్టాప్ లాస్ రూ.224;
హెల్త్‌కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్: రూ.488.50 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.523, స్టాప్ లాస్ రూ.471;
అంజనీ పోర్ట్ ల్యాండ్ సిమెంట్: రూ.159.97 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.171, స్టాప్ లాస్ రూ.154;
బీఎస్ఈ: రూ .5156.60 వద్ద కొనుగోలు, లక్ష్యం రూ .5518, స్టాప్ నష్టం రూ .4976.
సంబంధిత కథనం