Stocks to buy today : ఈ రూ. 82 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో మంచి ప్రాఫిట్స్​..!-stocks to buy today 14 may 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ఈ రూ. 82 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో మంచి ప్రాఫిట్స్​..!

Stocks to buy today : ఈ రూ. 82 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో మంచి ప్రాఫిట్స్​..!

Sharath Chitturi HT Telugu
May 14, 2024 08:50 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 112 పాయింట్లు పెరిగి 72,776 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 49 పాయింట్లు వృద్ధిచెంది 22,104 వద్ద ముగిసింది. ఇక 333 పాయింట్ల పెరిగిన బ్యాంక్​ నిఫ్టీ.. 47,754 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. లోక్​సభ ఎన్నికల అనిశ్చితి కారణంగా స్టాక్​ మార్కెట్​లలో తీవ్ర ఒడుదొడుకులు కనిపిస్తున్నాయి. జూన్​ 4న ఫలితాలు వెలువడేంతవరకు మదుపర్లు కాస్త అప్రమత్తంగా ఉండాలి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు మరో రూ. 4498.92 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3562.75 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

గత కొన్ని రోజులుగా ఎఫ్​ఐఐలు ఇండియన్​ స్టాక్​ మార్కెట్​లో విపరీతంగా సెల్​ చేస్తున్నారు. ఈ నెలలో ఇప్పటికే రూ. 29,474.42 కోట్లు విలువ చేసే షేర్లను అన్​లోడ్​ చేశారు. గత కొన్ని రోజులుగా స్టాక్​ మార్కెట్​లలో కనిపిస్తున్న తీవ్ర ఒడుగొడుకులకు ఇదీ ఒక కారణం.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 15 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.21శాతం, ఎస్​ అండ్​ పీ 500​ 0.02శాతం మేర నష్టపోయాయి. నాస్​డాక్​ 0.29శాతం లాభాల్లో ముగిసింది.

స్టాక్స్​ టు బై..

సన్​ ఫార్మా- బై రూ. 1525, స్టాప్​ లాస్​ రూ. 1480, టార్గెట్​ రూ. 1620

ఐసీఐసీఐ బ్యాంక్​- బై రూ. 1128, స్టాప్​ లాస్​ రూ. 1100, టార్గెట్​ రూ. 1200

SBI share price target : స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఎస్​బీఐ- బై రూ. 810, స్టాప్​ లాస్​ రూ. 797, టార్గెట్​ రూ. 850

ఫెడరల్​ బ్యాంక్​- బై రూ. 162, స్టాప్​ లాస్​ రూ. 155, టార్గెట్​ రూ. 170

హెచ్​సీఎల్​ టెక్​- బై రూ. 1313, స్టాప్​ లాస్​ రూ. 1280, టార్గెట్​ రూ. 1385

జీఎంఆర్​ ఇన్​ఫ్రా- బై రూ. 82.35, స్టాప్​ లాస్​ రూ. 81, టార్గెట్​ రూ. 85

ఒలెక్ట్రా గ్రీన్​- బై రూ. 1625, స్టాప్​ లాస్​ రూ. 1594, టార్గెట్​ రూ. 1720

బీహెచ్​ఈఎల్​- బై రూ. 283.3, స్టాప్​ లాస్​ రూ. 277, టార్గెట్​ రూ. 296

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం