Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 188 స్టాక్‌ని మిస్ అవ్వకండి.. భారీ లాభాలు!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని స్వల్ప నష్టాలతో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 57 పాయింట్లు పడి 79,649 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 21 పాయింట్లు కోల్పోయి 24,347 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 93 పాయింట్లు పెరిగి 50,578 వద్దకు చేరింది.
గత కొన్ని సెషన్లుగా భారత స్టాక్ మార్కెట్ ఒక రేంజ్లో ట్రేడవుతోందని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా పేర్కొన్నారు. నిఫ్టీ50 ఇండెక్స్ విజయవంతంగా 24,000 మార్కును దాటినప్పటికీ 24,350-24,400 స్థాయిలో రెసిస్టెన్స్ ఇంకా అధిగమించలేదని బగాడియా తెలిపారు. నిఫ్టీ 50 ఈ రేంజ్ నుంచి బయటపడిన తర్వాతే దలాల్ స్ట్రీట్ లో స్పష్టమైన బుల్లిష్ లేదా బేరిష్ ట్రెండ్ బయటపడుతుందని ఆయన తెలిపారు. నిర్దిష్ట స్టాక్స్‌పై దృష్టి సారించి ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వ్యూహాన్ని కొనసాగించాలని బగాడియా సూచించారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 4,680.51 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,477.73 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని స్వల్ప నష్టాలతో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
ఇదీ చూడండి:- PSU Stocks : పబ్లిక్ సెక్టార్ స్టాక్స్ కొనాలని చూస్తే ఆగస్టు 15లోపు ఈ 4 స్టాక్స్ గురించి ఆలోచించండి
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.36శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.23శాతం వృద్ధిచెందింది. నాస్డాక్ 0.21శాతం మేర లాభాలను చూసింది.
ఆసియా మార్కెట్లు చాలా వరకు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి. జపాన్ నిక్కీ భారీ లాభాల్లో దూసుకెళుతోంది.
స్టాక్స్ టు బై..
ఆర్వీఎన్ఎల్ : రూ.576 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.620, స్టాప్ లాస్ రూ.554
ఐనాక్స్ గ్రీన్: రూ.188.75 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.203, స్టాప్ లాస్ రూ.179
స్టవ్ క్రాఫ్ట్: రూ.673.20 వద్ద కొనండి, టార్గెట్ రూ.727, స్టాప్ లాస్ రూ.648
ఈఐహెచ్ అసోసియేటెడ్ హోటల్స్: రూ.988.70 వద్ద కొనండి, టార్గెట్ రూ.1,070, స్టాప్ లాస్ రూ.952
దిలీప్ బిల్డ్కాన్: రూ .556.80 వద్ద కొనండి, టార్గెట్ రూ .602, స్టాప్ నష్టం రూ .534.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం