శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 329 పాయింట్లు పెరిగి 82,500 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 104 పాయింట్లు వృద్ధిచెంది 25,285 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 418 పాయింట్లు పెరిగి 56,610 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 459.2 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,707.83 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ అక్టోబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 213.04 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 11,797.01 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 85 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50లో పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది. 25,450 వరకు వెళ్లొచ్చు. అది బ్రేక్ అయితే సూచీ 25,670 వరకు వెళ్లొచ్చు. కాగా 25,000- 24,900 లెవల్స్ దగ్గర నిఫ్టీ50కి కీలక సపోర్ట్ ఉంది,” అని బజాజ్ బ్రోకింగ్ రీసెర్చ్‌కి చెందిన నిపుణులు అభిప్రాయపడ్డారు.
చైనాపై 100శాతం అదనపు టారీఫ్‌లు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో శుక్రవారం ఆ దేశ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. డౌ జోన్స్ 1.90 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 2.71శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 3.56 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
లేటెంట్ వ్యూ ఎనలిటిక్స్- బై రూ. 440, స్టాప్ లాస్ రూ. 425, టార్గెట్ రూ. 470
కృషణ ఫోస్కెమ్- బై రూ. 570, స్టాప్ లాస్ రూ. 550, టార్గెట్ రూ. 615
ఐటీసీ- బై రూ. 402, స్టాప్ లాస్ రూ. 395, టార్గెట్ రూ. 415,
సిప్లా లిమిటెడ్- బై రూ. 1560, స్టాప్ లాస్ రూ. 1530, టార్గెట్ రూ. 1600
డీఎల్ఎఫ్- బై రూ. 740, స్టాప్ లాస్ రూ. 715, టార్గెట్ రూ. 775
మనోరమా ఇండస్ట్రీస్: రూ.1505 వద్ద కొనండి, లక్ష్యం రూ.1620, స్టాప్ లాస్ రూ.1450;
అసాహి ఇండియా గ్లాస్: రూ .897 వద్ద కొనండి, టార్గెట్ రూ .965, స్టాప్ లాస్ రూ .870;
బజాజ్ కన్స్యూమర్ కేర్: రూ.264కు కొనండి, టార్గెట్ రూ.280, స్టాప్ లాస్ రూ.253;
బోరోసిల్ రెన్యూవబుల్స్: రూ .642 వద్ద కొనండి, లక్ష్యం రూ .690, స్టాప్ లాస్ రూ .622;
లే ట్రావెన్యూస్ టెక్నాలజీ: రూ .318 వద్ద కొనండి, లక్ష్యం రూ .340, స్టాప్ లాస్ రూ .306
సంబంధిత కథనం