ఇరాన్​పై ఇజ్రాయెల్​ దాడి- ఈ రోజు స్టాక్​ మార్కెట్​కి భారీ నష్టాలు తప్పవా?-stocks to buy today 13 june 2025 gift nifty crude oil and other updates ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఇరాన్​పై ఇజ్రాయెల్​ దాడి- ఈ రోజు స్టాక్​ మార్కెట్​కి భారీ నష్టాలు తప్పవా?

ఇరాన్​పై ఇజ్రాయెల్​ దాడి- ఈ రోజు స్టాక్​ మార్కెట్​కి భారీ నష్టాలు తప్పవా?

Sharath Chitturi HT Telugu

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​

ఇజ్రాయెల్​- ఇరాన్​ ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 823 పాయింట్లు పడి 81,692 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 253 పాయింట్లు పతనమై 24,888 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 377 పాయింట్లు పడి 56,082 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,831.42 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 9,393.85 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 200 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్​పై ఇజ్రాయెల్​ దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్​ ప్రతిఘటిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

ఇజ్రాయెల్​- ఇరాన్​ మధ్య తాజా పరిణామాల మధ్య ముడి చమురు దాదాపు 8శాతం పెరిగి బ్యారెల్​కి 74.68 డాలర్లకు చేరింది. ఇది రెడు నెలల గరిష్ఠం!

నిఫ్టీ 50 సపోర్ట్​ అండ్​ రెసిస్టెన్స్​..

“నిఫ్టీ50కి తక్షణ సపోర్ట్​ 24,750 దగ్గర ఉంది. ఆ తర్వాత 24,500. 25,000- 25,050 వద్ద రెసిస్టెన్స్​ ఉంది. అది దాటలేకపోతే అమ్మకాల ఒత్తిడి కనిపించొచ్చు,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ డిప్యూటీ వైస్​ ప్రెసిడెంట్​ నదీష్​ షా తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.24 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.38శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.24 శాతం పెరిగింది.

కాగా ఇరాన్​పై ఇజ్రాయెల్​ దాడి నేపథ్యంలో ఫ్యూచర్స్​ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

సుబ్రోస్​ లిమిటెడ్​- బై రూ. 859, స్టాప్​ లాస్​ రూ. 825, టార్గెట్​ రూ. 920

కృష్ణన ఫోస్​కెమ్​- బై రూ. 490.05, స్టాప్​ లాస్​ రూ. 470, టార్గెట్​ రూ. 525

విజయ డయగ్నాస్టిక్​ సెంటర్​- బై రూ. 960, స్టాప్​ లాస్​ రూ. 945, టార్గెట్​ రూ. 995

అరవింద్​ ఫ్యాషన్​- బై రూ. 483, స్టాప్​ లాస్​ రూ. 520, టార్గెట్​ రూ. 474

ఇండియన్​ బ్యాంక్​- బై రూ. 625, స్టాప్​ లాస్​ రూ. 615, టార్గెట్​ రూ. 645

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం