Stocks to buy today : ఎయిర్​టెల్​, విప్రో స్టాక్స్​కి టైమ్​ వచ్చింది! షేర్​ ప్రైజ్​ టార్గెట్స్​ ఇవే..-stocks to buy today 13 january 2025 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ఎయిర్​టెల్​, విప్రో స్టాక్స్​కి టైమ్​ వచ్చింది! షేర్​ ప్రైజ్​ టార్గెట్స్​ ఇవే..

Stocks to buy today : ఎయిర్​టెల్​, విప్రో స్టాక్స్​కి టైమ్​ వచ్చింది! షేర్​ ప్రైజ్​ టార్గెట్స్​ ఇవే..

Sharath Chitturi HT Telugu
Jan 13, 2025 07:20 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టపోయాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 241 పాయింట్లు పడి 77,379 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 95 పాయింట్లు కోల్పోయి 23,431 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 769 పాయింట్లు పడి 48,734 వద్దకు చేరింది.

“స్వల్పకాలికానికి నిఫ్టీ50కి 23,600 కీలక స్థాయి. దీని పైన పుల్​బ్యాక్ ర్యాలతో 2380 వరకు వెళ్లొచ్చు. మరోవైపు, మార్కెట్ 23350 కంటే దిగువకు పడిపోతే, అమ్మకాల ఒత్తిడి మరింత పెరగొచ్చు. నిఫ్టీ50 23250-23100 శ్రేణికి చేరే అవకాశం ఉంది,” అని కోటక్ సెక్యూరిటీస్ వీపీ-టెక్నికల్ రీసెర్చ్ అమోల్ అథవాలే తెలిపారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2254.68 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3961.92 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

జనవరి​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 21,357.46 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 24215.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 160 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

యూఎస్​ జాబ్స్​ డేటా అంచనాలకు మించి పాజిటివ్​గా రావడంతో శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాలతో ముగించాయి. డౌ జోన్స్​ 1.63తం పడింది. ఎస్​ అండ్​ పీ 500​ 1.54శాతం పతనమైంది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.63శాతం పడింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

ఎయిర్​టెల్​- బై రూ. 1615.9, స్టాప్​ లాస్​ రూ. 1559, టార్గెట్​ రూ. 1729

ఎల్​టీఐమైండ్​ ట్రీ- బై రూ. 6124.4, స్టాప్​ లాస్​ రూ. 5910, టార్గెట్​ రూ. 6553

విప్రో- బై రూ. 300, స్టాప్​ లాస్​ రూ. 280, టార్గెట్​ రూ. 330

ఐఆర్​సీటీసీ- బై రూ. 780, స్టాప్​ లాస్​ రూ. 760, టార్గెట్​ రూ. 805

బిర్లాసాఫ్ట్​- బై రూ. 552, స్టాప్​ లాస్​ రూ. 530, టార్గెట్​ రూ. 580

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

ఆర్బీఎం ఇన్ఫ్రాకాన్: రూ.643 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.680, స్టాప్ లాస్ రూ.620;

రామకృష్ణ ఫోర్జింగ్స్: రూ.957.10, టార్గెట్ రూ.1020, స్టాప్ లాస్ రూ.920;

మెడికో రెమెడీస్: రూ.63.14 వద్ద కొనండి, టార్గెట్ రూ.68, స్టాప్ లాస్ రూ.60;

యూఎన్ఓ మిండా: రూ.1097.65 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1155, స్టాప్ లాస్ రూ.1065; మరియు

ప్రికోల్: రూ .559.30 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .595, స్టాప్ లాస్ రూ .540.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం