Stocks to buy today : ట్రేడింగ్​లో నష్టాలు వస్తున్నాయా? ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​ని ట్రాక్​ చేయండి..-stocks to buy today 12th november 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడింగ్​లో నష్టాలు వస్తున్నాయా? ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​ని ట్రాక్​ చేయండి..

Stocks to buy today : ట్రేడింగ్​లో నష్టాలు వస్తున్నాయా? ఈ 5 బ్రేకౌట్​ స్టాక్స్​ని ట్రాక్​ చేయండి..

Sharath Chitturi HT Telugu
Nov 12, 2024 08:20 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 10 పాయింట్లు పెరిగి 79,496 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 7 పాయింట్లు కోల్పోయి 24,141 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 315 పాయింట్లు పెరిగి 51,877 వద్దకు చేరింది.

“నిఫ్టీ అస్థిరంగా ఉండి, దిశా నిర్దేశక బ్రేకౌట్ ఇవ్వడంలో విఫలమైంది. సూచీ 24,000 - 24,350 మధ్య కదలాడింది. ముమెంటమ్ ఇండికేటర్ ఆర్ఎస్ఐ బుల్లిష్ క్రాసోవర్​ని చూపిస్తోంది. అదనంగా, రోజువారీ చార్టులో, ఇండెక్స్ ఇన్వర్టెడ్​ హామర్​ క్యాండిల్​ ఏర్పడింది. సూచీ 24,500-24,550 దిశగా కదలాడవచ్చని, 24,000 వద్ద సపోర్ట్​ ఉండొచ్చు,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ రూపక్ డే తెలిపారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2306.88 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2026.63 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

నవంబర్​ నెల​లో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 22,156.41 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 16,040.81 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.69శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.1శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.06శాతం వృద్ధిచెందింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

కొఫోర్ట్​- బై రూ. 8006.9, స్టాప్​ లాస్​ రూ. 7777, టార్గెట్​ రూ. 8500

రామ్​కో ఇండస్ట్రీస్​- బై రూ. 290.5, స్టాప్​ లాస్​ రూ. 280, టార్గెట్​ రూ. 310

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​- బై రూ. 1764, స్టాప్​ లాస్​ రూ. 1730, టార్గెట్​ రూ. 1810

ఇండస్​ఇండ్​ బ్యాంక్​- బై రూ. 1058, స్టాప్​ లాస్​ రూ. 1030, టార్గెట్​ రూ. 1610

గెయిల్​- బై రూ. 203, స్టాప్​ లాస్​ రూ. 195, టార్గెట్​ రూ. 220

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

వర్ధమాన్ హోల్డింగ్స్ లిమిటెడ్ : రూ.5526.55 వద్ద కొనండి, టార్గెట్ రూ.5900, నష్టాన్ని రూ.5333 ఆపండి;

టైన్ వాలా కెమికల్స్: రూ.315.05 వద్ద కొనండి, టార్గెట్ రూ.335, స్టాప్ లాస్ రూ.305;

ఏరిస్​ ఆర్గో: రూ.296..75 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.310, స్టాప్ లాస్ రూ.285;

ఐటీఐ: రూ.327.35, టార్గెట్ రూ.345, స్టాప్ లాస్ రూ.316;

ఆరోన్ ఇండస్ట్రీస్: రూ .288.95 వద్ద కొనండి, టార్గెట్ రూ .302, స్టాప్ నష్టం రూ .280.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం