Stocks to buy today : ఈ రూ. 515 స్టాక్​ కొనడానికి ఇదే రైట్​ టైమ్​- షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!-stocks to buy today 12th march 2024 sensex and nify news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stocks To Buy Today 12th March 2024 Sensex And Nify News Latest

Stocks to buy today : ఈ రూ. 515 స్టాక్​ కొనడానికి ఇదే రైట్​ టైమ్​- షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Sharath Chitturi HT Telugu
Mar 12, 2024 08:48 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..
స్టాక్స్​ టు బై టుడే లిస్ట్​..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 617 పాయింట్లు కోల్పోయి 73,503 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 161 పాయింట్ల నష్టంతో 22,333 వద్ద ముగిసింది. 508 పాయింట్ల నష్టంతో 47,328 వద్దకు చేరింది బ్యాంక్​ నిఫ్టీ.

ట్రెండింగ్ వార్తలు

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం నిఫ్టీలో పాజిటివ్​ ట్రెండ్​ కొనసాగుతోంది. కానీ అంతర్జాతీయ పరిణమాల కారణంగా ప్రాఫిట్​ బుకింగ్​ కనిపిస్తోంది. 22,100- 2050 లెవల్స్​ సపోర్ట్​గాను, 22,525 లెవల్​ రెసిస్టెన్స్​గాను ఉందని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4212.76 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3238.39 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ సూచీలు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ.. దాదాపు 30 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.1శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500 0.11శాతం, నాస్​డాక్​ 0.4శాతం మేర నష్టపాయోయి.

స్టాక్స్​ టు బై..

Stock to buy list : పిడిలైట్​ ఇండస్ట్రీస్​:- బై రూ. 2906.4, స్టాప్​ లాస్​ రూ. 2820, టార్గెట్​ రూ. 3050

అపొలో హాల్పిటల్స్​:- బై రూ. 6204.7, స్టాప్​ లాస్​ రూ. 6060, టార్గెట్​ రూ. 6520

Hindustan Petroleum share price target : హిందుస్థాన్​ పెట్రోలియం:- బై రూ. 514, స్టాప్​ లాస్​ రూ. 500, టార్గెట్​ రూ. 536

ఎం అండ్​ ఎం ఫైనాన్స్​:- బై రూ. 287, స్టాప్​ లాస్​ రూ. 280, టార్గెట్​ రూ. 305

Cams share price target : కామ్స్​:- బై రూ. 3000- రూ. 3006, స్టాప్​ లాస్​ రూ. 2940, టార్గెట్​ రూ. 3124

కేఈసీ:- బై రూ. 754- రూ. రూ. 748, స్టాప్​ లాస్​ రూ. 727, టార్గెట్​ రూ. 790

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం