Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్.. ఈ రూ. 125 స్టాక్‌తో షార్ట్ టర్మ్‌లో భారీ లాభాలు!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 203 పాయింట్లు పడి 76,490 వద్ద స్థిరపడింది. నిఫ్టీ.. 31 పాయింట్లు కోల్పోయి 23,259 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ.. 22 పాయింట్ల లాభంతో 49,781 వద్ద ఓపెన్ అయ్యింది.

స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ ట్రెండ్ పాజిటివ్‌గానే ఉంది. అయితే.. ఆల్ టైమ్ హైని తాకినా.. అక్కడి నుంచి పైకి వెళ్లడానికి మాత్రం, బలం కనిపించడం లేదు. 23,300 దగ్గర ఒడుదొడుకులు కనిపిస్తే.. నిఫ్టీలో షార్ట్ టర్మ్ సెల్లింగ్ చూడొచ్చు. 23,100 లెవల్స్ సపోర్ట్‌గా ఉంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
Stock market news today : సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2572.38 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు సైతం రూ. 2764.46 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 55 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
ఇదీ చూడండి:- Apple WWDC 2024 : ఐఓఎస్ 18 వచ్చేస్తోంది.. కొత్త ఆపరేటింగ్ సిస్టెమ్ హైలైట్స్ ఇవే!
అమెరికా స్టాక్ మార్కెట్లు..
US Stock market updates : సోమవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.18శాతం లాభపడింది. ఎస్ అండ్ పీ 500 0.2శాతం, నాస్డాక్ 0.35శాతం మేర పెరిగింది.
స్టాక్స్ టు బై..
జెన్జార్ టెక్నాలజీస్:- బై రూ. 688.4, స్టాప్ లాస్ రూ. 665, టార్గెట్ రూ. 730
Stocks to buy : వీఏ టెక్ వబాగ్:- బై రూ. 1153.3, స్టాప్ లాస్ రూ. 1111, టార్గెట్ రూ. 1222
పంజాబ్ నేషనల్ బ్యాంక్ పీఎన్బీ:- బై రూ. 126, స్టాప్ లాస్ రూ. 120, టార్గెట్ రూ. 135
ఏడబ్ల్యూఎల్:- బై రూ. 345, స్టాప్ లాస్ రూ. 338, టార్గెట్ రూ. 365
ఎల్టీ:- బై రూ. 3542, స్టాప్ లాస్ రూ. 3480, టార్గెట్ రూ. 3650
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం