సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 256 పాయింట్లు పెరిగి 82,445 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 100 పాయింట్లు వృద్ధిచెంది 25,103 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 261 పాయింట్లు పెరిగి 56,840 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,992.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,503.79 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 65 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 25,000 వద్ద కీలక సపోర్ట్ జోన్ ఉంది. ఆ లెవల్స్ పైన ఉన్నంత వరకు ట్రెండ్ పాజిటివ్‌గా ఉన్నట్టు. 25,350-25,400 వద్ద రెసిస్టెన్స్ ఎదురవ్వొచ్చు. కానీ 25,000 దిగువకు పడితే అమ్మకాల ఒత్తిడి కనిపించవచ్చు,” అని కొటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు.
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్‌లో మార్పు లేదు. ఎస్ అండ్ పీ 500 0.09శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.1 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.
సుదర్శన్ కెమికల్ ఇండస్ట్రీస్- బై రూ. 1291.9, స్టాప్ లాస్ రూ. 1240, టార్గెట్ రూ. 1380
స్కిప్పర్- బై రూ. 524.8, స్టాప్ లాస్ రూ. 505, టార్గెట్ రూ. 560
ఎన్‌హెచ్‌పీసీ- బై రూ. 90, స్టాప్ లాస్ రూ. 87, టార్గెట్ రూ. 97
బీహెచ్ఈఎల్- బై రూ. 258 స్టాప్ లాస్ రూ. 250, టార్గెట్ రూ. 270
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ- బై రూ. 638, స్టాప్ లాస్ రూ. 618, టార్గెట్ రూ. 675
వర్ల్‌పూల్ ఇండియా: రూ.1354.70 వద్ద కొనండి, టార్గెట్ రూ.1410, స్టాప్ లాస్ రూ.1300;
విశాల్ మెగా మార్ట్: రూ.131.01 వద్ద కొనండి, టార్గెట్ రూ.141, స్టాప్ లాస్ రూ.126;
మణప్పురం ఫైనాన్స్: రూ.264.80 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.283, స్టాప్ లాస్ రూ.255;
ఎల్ అండ్ టీ ఫైనాన్స్: రూ.193 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.207, స్టాప్ లాస్ రూ.186;
హింద్వేర్ హోమ్ ఇన్నోవేషన్: రూ.284.30 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.305, స్టాప్ లాస్ రూ.271.
సంబంధిత కథనం