Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ రోజు మీరు ట్రాక్​ చేయాల్సిన 5 స్టాక్స్​ లిస్ట్​..-stocks to buy today 10th jan 2025 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ రోజు మీరు ట్రాక్​ చేయాల్సిన 5 స్టాక్స్​ లిస్ట్​..

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ రోజు మీరు ట్రాక్​ చేయాల్సిన 5 స్టాక్స్​ లిస్ట్​..

Sharath Chitturi HT Telugu
Jan 10, 2025 08:10 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్స్​ టు బై లిస్ట్​..
స్టాక్స్​ టు బై లిస్ట్​..

దేశీయ స్టాక్​ మార్కెట్​ల పతనం కొనసాగుతోంది. గురువారం ట్రేడింగ్​ సెషన్​లోనూ సూచీలు నష్టపోయాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 528 పాయింట్లు పడి 77,620 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 162 పాయింట్లు కోల్పోయి 23,526 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 332 పాయింట్లు పడి 49,503 వద్దకు చేరింది.

yearly horoscope entry point

సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం మార్కెట్ బలహీనంగా ఉన్నప్పటికీ ఓవర్​సోల్డ్​ పొజీషన్​లో ఉంది. అందువల్ల పుల్ బ్యాక్ ర్యాలీకి అవకాశం ఉంది. నిఫ్టీ50కి 23650 కీలకం కానుంది. ఈ స్థాయి కంటే దిగువన కొనసాగితే, మార్కెట్ 23400-23375 వరకు కొనసాగించవచ్చు. 23650 పైన పెరిగితే, తిరిగి 23750-23800 కు పుంజుకోవచ్చు,” అని అన్నారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 7170.87 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7639.63 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

జనవరి​​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 1,9102.78 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 20253.95 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం అమెరికా స్టాక్​ మార్కెట్​లకు సెలవు. ఇక ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

విజయ డయొగ్నాస్టిక్స్​- బై రూ. 1221.3, స్టాప్​లాస్​ రూ. 1177, టార్గెట్​ రూ. 1313

షైలీ ఇంజినీరింగ్​ ప్లాస్టిక్స్​- బై రూ. 1630.7, స్టాప్​ లాస్​ రూ. 1565, టార్గెట్​ రూ. 1777

మారికో లిమిటెడ్​- బై రూ. 667, స్టాప్​ లాస్​ రూ. 650, టార్గెట్​ రూ. 690

ఆర్తీ ఇండస్ట్రీస్​- బై రూ. 413, స్టాప్​ లాస్​ రూ. 403, టార్గెట్​ రూ. 430

ఆదిత్య బిర్లా ఫ్యాషన్​ అండ్​ రీటైల్​- బై రూ. 277, స్టాప్​ లాస్​ రూ. 265, టార్గెట్​ రూ. 295

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం