Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- ఈ రూ. 160 రైల్వే స్టాక్‌లో ట్రేడ్‌తో లాభాలు..!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్ స్టాక్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 201 పాయింట్లు పడి 81,508 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 59 పాయింట్లు కోల్పోయి 24,619 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 102 పాయింట్లు పడి 53,408 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 724.27 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1648.07 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
డిసెంబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 12,657.86 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 144.4 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.54శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.61శాతం పతనమైంది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.62శాతం పడింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
సిటీ యూనియన్ బ్యాంక్- బై రూ. 186.27; టార్గెట్ రూ. 195; స్టాప్ లాస్ రూ. 180.
లైయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ- బై రూ. 1,098; టార్గెట్ 1,180; స్టాప్ లాస్ 1,060.
ఐఆర్ఎఫ్సీ- బై రూ. 159; టార్గెట్ రూ. 168; స్టాప్ లాస్ 154.
హెచ్ఏఎల్- బై రూ. 4618, టార్గెట్ రూ. 4950, స్టాప్ లాస్ రూ. 4500.
యాక్సిస్ బ్యాంక్- బై రూ. 1,162, టార్గెట్ రూ. 1,1195, స్టాప్ లాస్ రూ. 1150.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
బీఎల్ఎస్ ఇంటర్నేషనల్: రూ.447 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.479, స్టాప్ లాస్ రూ.431;
రెయిన్ ఇండస్ట్రీస్: రూ.187.10 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.201, స్టాప్ లాస్ రూ.180;
అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్: రూ.378.40 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.405, స్టాప్ లాస్ రూ.365;
చాలెట్ హోటల్స్: రూ.928.55 వద్ద కొనండి, టార్గెట్ రూ.994, స్టాప్ లాస్ రూ.896; మరియు
కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్: రూ .1176.40 వద్ద కొనండి, టార్గెట్ రూ .1258, స్టాప్ లాస్ రూ .1135.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం