Stocks to buy today : ఐటీసీ షేర్లకు టైమ్ వచ్చింది! ఈ రూ. 430 స్టాక్‌తో భారీ లాభాలు..
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 1062 పాయింట్లు పడి 72,404 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 345 పాయింట్లు కోల్పోయి 21,957 వద్ద ముగిసింది. ఇక 533 పాయింట్ల నష్టంతో బ్యాంక్ నిఫ్టీ.. 47,488 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీలో నెగిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది. ఎలక్షన్ ఔట్‌పుట్‌పై వస్తున్న అంచనాలు.. మార్కెట్లో ప్రతికూలంగా మారాయి. కానీ.. నిఫ్టీ ఓవర్‌సోల్డ్ పొజీషన్లోకి వెళ్లింది కాబట్టి.. రానున్న ట్రేడింగ్ సెషన్స్‌లో పైకి బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. 21,800- 21,900 లెవల్స్ దగ్గర నిఫ్టీకి బలమైన సపోర్ట్ కూడా ఉంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు మరో రూ. 6994.86 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5642.53 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
Stock market news today :s గత కొన్ని రోజులుగా ఎఫ్ఐఐలు ఇండియన్ స్టాక్ మార్కెట్లో విపరీతంగా సెల్ చేస్తున్నారు. ఈ నెలలో ఇప్పటికే రూ. 22,858 కోట్లు విలువ చేసే షేర్లను అన్లోడ్ చేశారు. గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్ల పతనానికి ఇదీ ఒక కారణం.
దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో మొదలుపెట్టే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
ఇదీ చూడండి:- Demat Account: మీ డీమ్యాట్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ హిస్టరీ సహా అన్ని వివరాలు తెలుసుకోవడం ఎలా?
అమెరికా స్టాక్ మార్కెట్లు..
America Stock market today : గురువారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. డౌ జోన్స్ 0.85శాతం, నాస్డాక్ 0.27శాతం మేర లాభపడ్డాయి. ఎస్ అండ్ పీ 500 0.51శాతం లాభాల్లో ముగిసింది.
స్టాక్స్ టు బై..
ఇన్ఫోసిస్:- బై రూ. 1439.5, స్టాప్ లాస్ రూ. 1400, టార్గెట్ రూ. 1512
సన్ టీవీ:- బై రూ. 656.8, స్టాప్ లాస్ రూ. 629, టార్గెట్ రూ. 704
ITC share price target : ఐటీసీ:- బై రూ. 429, స్టాప్ లాస్ రూ. 418, టార్గెట్ రూ. 440
ఏజిస్ లాజిస్టిక్స్:- బై రూ. 580, స్టాప్ లాస్ రూ. 560, టార్గెట్ రూ. 630
టీవీఎస్ మోటార్:- బై రూ. 2065, స్టాప్ లాస్ రూ. 2010, టార్గెట్ రూ. 2150
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం