Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- నేడు ఈ 6 స్టాక్స్‌లో ట్రేడింగ్ ఛాన్స్!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1272 పాయింట్లు పడి 84,299 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 368 పాయింట్లు కోల్పోయి 25,811 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 856 పాయింట్లు పతనమై 52,978 వద్దకు చేరింది.
నిఫ్టీ 50 గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌తో రోజువారీ చార్ట్‌లో లాంగ్ బేర్ క్యాండిల్ని సృష్టించింది.
"సాంకేతికంగా, ఈ చార్ట్ నమూనా బేరిష్ రివర్సల్ క్యాండిల్ నమూనాను సూచిస్తుంది. ఈ మార్కెట్ చర్య నిఫ్టీ 50కి స్వల్పకాలిక టాప్ రివర్సల్ చర్యను సూచిస్తుంది. రాబోయే సెషన్లలో మరింత బలహీనతను అశించొచ్చు. రోజువారీ టైమ్ ఫ్రేమ్ చార్ట్ ప్రకారం నిఫ్టీలో బుల్లిష్‌నెస్ చెక్కుచెదరకుండా ఉంది. ప్రస్తుత బలహీనత కొత్త గరిష్ట స్థాయికి అనుగుణంగా ఉండవచ్చు,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి అన్నారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 9791.93 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6645.8 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇదీ చూడండి:- Moo Deng meme coin : కేవలం 17 రోజుల్లో.. రూ. 1లక్ష పెట్టుబడి = రూ. 100 కోట్లు! ఎలా సాధ్యమైంది?
సెప్టెంబర్‌లో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 12611.79 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 30857.3 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.33శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.13శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.39 పతనమైంది.
స్టాక్స్ టు బై..
ఎన్టీపీసీ:- బై సీఎంపీ | స్టాప్ లాస్: రూ.430 | టార్గెట్ ధర: రూ.465
ఫెడరల్ బ్యాంక్:- బై సీఎంపీ | స్టాప్ లాస్: రూ.190 | టార్గెట్ ధర: రూ.210
జేఎస్‌డబ్ల్యూ స్టీల్:- బై సీఎంపీ | స్టాప్ లాస్: రూ.1,005 | టార్గెట్ ధర: రూ.1,080
రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్): బై రూ. 533, స్టాప్ లాస్ రూ. 520, టార్గెట్ రూ. 550
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ): బై రూ. 179, స్టాప్ లాస్ రూ.175, టార్గెట్ రూ. 184
త్రిభోవందాస్ భీమ్జీ జవేరి (టీబీజెడ్): బై రూ. 282, రూ.272 స్టాప్ లాస్, టార్గెట్ రూ.303 టార్గెట్
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం