Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్.. ఈ రూ. 120 స్టాక్‌తో షార్ట్ టర్మ్‌లో భారీ లాభాలు!
Stocks to buy : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 210 పాయింట్లు పడి 79,032 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 34 పాయింట్ల నష్టంతో 24,014 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం.. 469 పాయింట్లు కోల్పోయి 52,342 వద్దకు చేరింది.
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ షార్ట్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్‌గా ఉంది. 24,000- 24,100 వద్ద బలమైన రెసిస్టెన్స్ కనిపిస్తోంది. అక్కడి నుంచి కిందకు పడితే, ట్రేడర్లు బై చేయొచ్చు. ఇక 23,800 లెవల్స్ వద్ద సపోర్ట్ ఉంది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 23.09 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6658.31 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
జూన్ నెలలో ఎఫ్ఐఐలు మొత్తం మీద రూ. 2037.47 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ. 28,633.15 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ కారణంగానే దేశీయ స్టాక్ మార్కెట్లు చాలా నెలల తర్వాత.. ఒక్క నెలలో భారీగా వృద్ధిచెందాయి.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్పంగా నష్టపోయాయి. డౌ జోన్స్ 0.12శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.41శాతం, నాస్డాక్ 0.71శాతం మేర నష్టాలను చూశాయి.
స్టాక్స్ టు బై..
గర్వారే హైటెక్:- బై రూ. 2356.4, స్టాప్ లాస్ రూ. 2270, టార్గెట్ రూ. 2470
గ్రాసిమ్ ఇండస్ట్రీస్:- బై రూ. 2670.4, స్టాప్ లాస్ రూ. 2575, టార్గెట్ రూ. 2800
ఐజీఎల్:- బై రూ. 504, స్టాప్ లాస్ రూ. 485, టార్గెట్ రూ. 525
కెనెరా బ్యాంక్:- బై రూ. 119, స్టాప్ లాస్ రూ. 115, టార్గెట్ రూ. 126
ఆర్సీఎఫ్:- బై రూ. 193, స్టాప్ లాస్ రూ. 185, టార్గెట్ రూ. 202
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం