Day Trading Stocks 22nd March: డే ట్రేడర్స్ అలర్ట్.. నేడు ఫోకస్ చేయాల్సిన 6 స్టాక్స్ ఇవే-stocks to buy suggestions for day traders for 22 march 2023 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stocks To Buy Suggestions For Day Traders For 22 March 2023

Day Trading Stocks 22nd March: డే ట్రేడర్స్ అలర్ట్.. నేడు ఫోకస్ చేయాల్సిన 6 స్టాక్స్ ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 22, 2023 06:54 AM IST

Day Trading Stocks: డే ట్రేడింగ్ చేసే వారు నేటి సెషన్‍లో గమనించాల్సిన స్టాక్‍లను నిపుణులు సూచించారు. అలాగే నేడు స్టాక్ మార్కెట్లు మొదయ్యే ఛాన్స్ ఉందంటే..

Stocks to Buy Today: స్టాక్స్​ టు బై లిస్ట్​
Stocks to Buy Today: స్టాక్స్​ టు బై లిస్ట్​

Day Trading Guide 22nd March: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం సెషన్‍ను సానుకూలంగా ముగించాయి. అమెరికా మార్కెట్ల పాజిటివ్ పవనాలతో భారత ఈక్విటీ మార్కెట్లు లాభాలను చూశాయి. మంగళవారం సెషన్‍లో నిఫ్టీ 119.10 పాయింట్లు అధికమై 17,107.50 పాయింట్లకు చేరింది. బీఎస్ఈ సెన్సెక్స్ 445.73 పాయింట్ల లాభంతో 58,074.68 పాయింట్లకు ఎగిసింది. బ్యాంక్ నిఫ్టీ 532 పాయింట్ల లాభంతో 39,894 పాయింట్లకు చేరింది. నేడు (మార్చి 22, బుధవారం) స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‍గా ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ ఏవో ఇక్కడ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

Day Trading Guide 22nd March: ఎస్‍జీఎక్స్ నిఫ్టీని ప్రకారం చూస్తే నేటి సెషన్‍ను భారత స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‍గా మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎస్‍జీఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం 19 పాయింట్ల లాభంతో ఉంది. మరోవైపు మంగళవారం సెషన్‍లో అమెరికా మార్కెట్లు మంచి లాభాలతో ముగియటం సానుకూల అంశంగా ఉంది.

ఈ లెవెల్స్ కీలకం

Day Trading Guide 22nd March: 17,200 లెవెల్స్ నిఫ్టీకి కీలకంగా ఉందని హెచ్‍డీఎఫ్‍సీ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి అభిప్రాయపడ్డారు. ఆ స్థాయిని నిలబెట్టుకొని ముందుకు వెళితే నిఫ్టీ మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. ఒకవేళ నిఫ్టీ మళ్లీ పడితే 16,950 లెవెల్స్ వద్ద తక్షణ సపోర్ట్ ఉందని విశ్లేషించారు.

Day Trading Stocks: ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్

  • జీఎన్ఎఫ్‍సీ: బై అట్ రూ.534, టార్గెట్: రూ.552, స్టాప్ లాస్: రూ.525
  • యాక్సిస్ బ్యాంక్: బై అట్ రూ.855, టార్గెట్: రూ.880, స్టాప్ లాస్: రూ.842
  • ఆర్ఈసీ: బై అట్ రూ.118, టార్గెట్: రూ.124, స్టాప్ లాస్: రూ.116
  • ఐడీఎఫ్‍సీ ఫస్ట్ బ్యాంక్: బై అట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ (సీఎంపీ), టార్గెట్: రూ.60, స్టాప్ లాస్: రూ.52
  • అంబుజా సిమెంట్స్: బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.380 నుంచి రూ.390, స్టాప్ లాస్: రూ.360
  • బజాజ్ ఫైనాన్స్: బై అట్ రూ.5,710, టార్గెట్: రూ.5,800, స్టాప్ లాస్: రూ.5,650

(గమనిక:- ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel