Stocks to buy today : స్టాక్స్ టు బై.. ఎల్ఐసీ, ఎస్బీఐ షేర్ ప్రైజ్ టార్గెట్స్ ఇవే..
Stocks to buy today : ట్రేడర్స్ ట్రాక్ చేయాల్సిన నేటి స్టాక్స్ టు బై లిస్ట్‌ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
Stocks to buy today : వరుస నష్టాలకు బ్రేక్ పెడుతూ.. దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్‌ను లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 448 పాయింట్ల లాభంతో 59,411 వద్ద స్థిరపడింది. 146 పాయింట్లు పెరిగిన నిఫ్టీ.. 17,450 వద్దకు చేరింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 429 పాయింట్లు లాభపడి.. 40,698 వద్ద ముగిసింది.
ట్రెండింగ్ వార్తలు
స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ షార్ట్ టర్మ్ డౌన్‌ట్రెండ్ మారింది! సిస్టెమ్లో షార్ట్ పొజిషన్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏమాత్రం షార్ట్ కవరింగ్ కనిపించినా, మార్కెట్లు ఇక్కడి నుంచి ఇంకా పెరుగుతాయి. రానున్న సెషన్స్పైనే ఇది ఆధారపడి ఉంటుంది.
Stock market news today : "కీలకమైన సపోర్ట్ నుంచి మార్చ్ 1 ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ పుంజుకుంది. ఫలితంగా నిఫ్టీ షార్ట్ టర్మ్ డౌన్‌ట్రెండ్ మారింది. ఇక్కడి నుంచి ముందు 17,610 లెవల్స్‌కు నిఫ్టీ చేరే అవకాశం ఉంది. 17,299- 17,353 లెవల్స్ వద్ద సపోర్ట్ దొరకొచ్చు," అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కు చెందిన రీటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసానీ తెలిపారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 424.88కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1498.66కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
స్టాక్స్ టు బై లిస్ట్..
రామ్‌కో సిమెంట్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 710, టార్గెట్ రూ. 750- రూ. 760
యూపీఎల్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 695, టార్గెట్ రూ. 730- రూ. 740
LIC share price target : లైఫ్ ఇన్ష్యూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ):- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 584, టార్గెట్ రూ. 640
SBI share price target : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ):- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 516, టార్గెట్ రూ. 565
హావెల్స్ ఇండియా:- బై రూ. 1216, స్టాప్ లాస్ రూ. 1180, టార్గెట్ రూ. 1260
Tata Motors share price target : టాటా మోటార్స్, బై రూ. 426, స్టాప్ లాస్ రూ. 416, టార్గెట్ రూ. 426
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)