Stocks To Buy : బడ్జెట్ తర్వాత కొనాల్సిన 9 స్టాక్స్.. దీర్ఘకాలంలో మంచి రాబడి !
Stocks To Buy : స్టాక్ మార్కెట్లపై బడ్జెట్ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. బడ్జెట్ తర్వాత కొన్ని షేర్లు పైపైకి వెళ్తుంటే.. మరికొన్ని పడిపోతుంటాయి. బడ్జెట్ తర్వాత దీర్ఘకాలంలో రాబడి వచ్చేందుకు కొనాల్సిన స్టాక్స్ చూద్దాం..(గమనిక : ఇది నిపుణుల అభిప్రాయం మాత్రమే.. పెట్టుబడి సలహా కాదు)
కేంద్ర బడ్జెట్ 2024పై దేశీయ స్టాక్ మార్కెట్ పేలవంగా స్పందించినప్పటికీ, నిపుణులు దీనిని దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఒక అవకాశంగా చూస్తున్నారు. 2024 బడ్జెట్ తర్వాత కొనుగోలు చేయాల్సిన స్టాక్స్‌కు సంబంధించి ఎస్ఎస్ వెల్త్ స్ట్రిట్క్‌కు చెందిన సుగంధ సచ్దేవ్ 9 స్టాక్స్‌లో కొనుగోలు చేయాలని సిఫార్సు చేశారు. 2024 బడ్జెట్ భారతదేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా స్థాపించడానికి ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆయన అన్నారు. తయారీ, ఇన్ఫ్రా, రక్షణ, విద్యుత్ రంగాలకు మధ్య, దీర్ఘకాలికంగా అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
బీహార్, ఆంధ్రప్రదేశ్‌లపై ప్రత్యేక దృష్టి సారించి ఆర్థిక వివేకం, సంక్షేమ పథకాల మధ్య సమతుల్యత ఈ బడ్జెట్‌లో హైలైట్‌గా నిలిచిందని స్టాక్ బాక్స్ రీసెర్చ్ హెడ్ మనీష్ చౌదరి తెలిపారు. ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల కల్పన, తయారీ, పునరుత్పాదక ఇంధనం, కొత్త రంగాల కోసం పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం, గ్రామీణ ఆదాయంపై ప్రధానంగా దృష్టి సారించి ప్రజల చేతుల్లో డిస్పోజబుల్ ఆదాయాన్ని సృష్టించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఎస్ఎస్ వెల్త్ స్ట్రీట్ ఫౌండర్ సుగంధ సచ్దేవ్ మాట్లాడుతూ, 'బడ్జెట్ 2024 భారతదేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా స్థాపించే లక్ష్యంతో ఆర్థిక వృద్ధిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2025 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు జీడీపీలో 4.9 శాతంగా ఉంది. ఇది మధ్యంతర బడ్జెట్ అంచనా 5.1 కంటే తక్కువ. ' అని అన్నారు.
బడ్జెట్ 2024 తర్వాత ఈ స్టాక్స్‌పై ఫోకస్ చేయెుచ్చు
2024 బడ్జెట్ తర్వాత కొనుగోలు చేయాల్సిన స్టాక్స్‌కు సంబంధించి సుగంధ సచ్దేవ్ కొన్ని సలహాలు చేశారు. 9 స్టాక్స్ కొనుగోలు చేయాలని సిఫార్సు చేస్తున్నారు. అవేంటో చూద్దాం..
1. ఎస్బీఐ కార్డు: రూ.680 నుంచి రూ.685 వరకు కొనండి, రూ.840 టార్గెట్ పెట్టుకోండి, రూ.595 స్టాప్ లాస్ పెట్టడం మర్చిపోవద్దు.
2. ఒబెరాయ్ రియాల్టీ : రూ.1570 నుంచి రూ.1580 వరకు కొనండి, రూ.2050 టార్గెట్ పెట్టుకోండి, 1280 స్టాప్ లాస్ ఉంచండి.
3. రైట్స్ రూ.650 నుంచి రూ.660, టార్గెట్ రూ.880, స్టాప్ లాస్ రూ.520గా ఉంచండి.
4. కేపీఐటీ టెక్ : 1690 నుంచి 1695 వద్ద కొనండి, రూ.2080 టార్గెట్ పెట్టుకోండి, 1500 స్టాప్ లాస్ పెట్టడం మర్చిపోవద్దు.
5. హెచ్బీఎల్ పవర్ : రూ.540 నుంచి రూ.550, టార్గెట్ రూ.765, స్టాప్ లాస్ రూ.430.
6. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ : రూ.310 నుంచి రూ.312, టార్గెట్ రూ.435, స్టాప్ లాస్ రూ.225.
7. రామ్కో సిమెంట్ : రూ.790 నుంచి రూ.795, టార్గెట్ రూ.965, స్టాప్ లాస్ రూ.680.
8. ఎన్సీసీ: రూ.335 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.435, స్టాప్ లాస్ రూ.270.
9. టాటా కన్స్యూమర్: రూ.1220 నుంచి రూ.1230, టార్గెట్ రూ.1480, స్టాప్ లాస్ రూ.1070.
గమనిక : నిపుణుల సిఫార్సులు, సలహాలు, అభిప్రాయాలు మాత్రమే ఇస్తున్నాం. అభిప్రాయాలు వారివే తప్ప HT Teluguవి కావు. ఇది స్టాక్ పనితీరు గురించి మాత్రమే, పెట్టుబడి సలహా గురించి కాదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్‌కు లోబడి ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించండి.