Stocks To Buy : ఈ మూడు స్టాక్స్ బెటర్ అంటున్న నిపుణులు.. టార్గెట్ ధర ఎంతో చూడండి
Stocks To Buy Today : స్టాక్ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన స్టాక్స్ గురించి ప్రభుదాస్ లిల్లాధేర్ టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ వైశాలి పరేఖ్ కొన్ని విషయాలు పంచుకున్నారు. వీటిలో ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్, విప్రో లిమిటెడ్ ఉన్నాయి.
ప్రభుదాస్ లిల్లాధేర్ టెక్నికల్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ వైశాలి పరేఖ్ ఈ రోజు స్టాక్ మార్కెట్ కదలికల గురించి చెప్పారు. నేడు కొనుగోలు చేయాల్సిన స్టాక్స్ గురించి వైశాలి పరేఖ్ సలహాలు ఇచ్చారు. మూడు స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్, విప్రో లిమిటెడ్ ఈ జాబితాలో ఉన్నాయి.
నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్‌లు అవుట్ లుక్ గురించి.. పరేఖ్ మాట్లాడుతూ 'నిఫ్టీ 24,900 స్థాయిలకు దగ్గరగా ఉంటే తదుపరి లక్ష్యం 25,600 స్థాయిలకు మరింత వృద్ధికి సిద్ధంగా ఉంది.' అని చెప్పారు.
బ్యాంక్ నిఫ్టీపై పరేఖ్ మాట్లాడుతూ.. 'సెషన్‌లో బ్యాంకు నిఫ్టీ 51,400 స్థాయిలకు సమీపంలో నిరోధిస్తోంది, మొత్తం మీద నిఫ్టీ ఇండెక్స్‌తో పోలిస్తే మందకొడిగా కదలాడుతోంది. నిఫ్టీ 50కి 24,900 వద్ద మద్దతు ఉండగా, నిరోధం 25,200 వద్ద ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ రోజువారీ శ్రేణి 50,800 నుండి 51,700 వరకు ఉంటుంది.' అని తెలిపారు. ఈ సందర్భంగా కొనాల్సిన మూడు స్టాక్స్ గురించి సలహా ఇచ్చారు.
ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ను రూ.220 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.240గా పెట్టండి. స్టాప్ లాస్ రూ.213 వద్ద ఉంచాలి.
ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్ షేరును రూ .1,415 వద్ద కొనండి. రూ .1,450 లక్ష్యాన్ని ఉంచండి. రూ .1,390 స్టాప్ లాస్ పెట్టడం మర్చిపోవద్దు.
విప్రో లిమిటెడ్ షేరును రూ.534.6 వద్ద కొనండి. రూ.560 టార్గెట్ ఉంచండి. రూ.522 స్టాప్ లాస్‌తో పెట్టండి.
భారత స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 50 ఆగస్టు 28 బుధవారం కొత్త రికార్డు స్థాయిని తాకింది. బుధవారం నాటి ట్రేడింగ్ సెషన్ తర్వాత నిఫ్టీ 0.14 శాతం లాభంతో 25,052.35 పాయింట్ల వద్ద ముగియగా, గత ట్రేడింగ్ సెషన్ నిఫ్టీ 25,017.75 పాయింట్ల వద్ద ముగిసింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 0.09 శాతం లాభంతో 81,785.56 పాయింట్ల వద్ద ముగిసింది.
గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. నిపుణుల సిఫార్సులు, సలహాలు, అభిప్రాయాలు మాత్రమే. ఇవి వారివే తప్ప HT Teluguకు సంబంధించినవి కావు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్‌కు లోబడి ఉంటుంది. పెట్టుబడి పెట్టే ముందు నిపుణులతో మాట్లాడండి.