Stocks to buy : ట్రేడర్స్ అలర్ట్.. ఈ రూ. 227 స్టాక్‌తో భారీ లాభాలు!
Stocks to buy : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

Stocks to buy : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 27 పాయింట్లు పడి 79,897 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 8 పాయింట్లు కోల్పోయి 24,315 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 81 పాయింట్లు పెరిగి 52,271 వద్దకు చేరింది.
నిఫ్టీకి సంబంధించిన అవుట్‌లుక్‌పై హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ నాగరాజ్ శెట్టి మాట్లాడుతూ.. “24,500 పైన స్థిరమైన కదలిక కనిపిస్తే, నిఫ్టీ50 24,900 వరకు వెళ్లొచ్చు. నిఫ్టీకి సపోర్ట్ 24,150 వద్ద ఉంది,” అని అన్నారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1137.01 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1676.47 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 6697.05 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. డీఐఐలు రూ. 6656.83 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 60 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
ఇదీ చూడండి:- IPO News: తొలి రోజే 40 రెట్లు బుక్ అయిన ఎస్ఎంఈ ఐపీఓ; జీఎంపీ ఎంతో తెలుసా?
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.08శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.08శాతం పడింది. కానీ నాస్డాక్ 1.95శాతం మేర పతనమైంది.
స్టాక్స్ టు బై..
సీఈఎస్సీ: రూ.192 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.201, స్టాప్ లాస్ రూ.185
సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్: రూ.527.30 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.555, స్టాప్ లాస్ రూ.510.
అశోక్ లేలాండ్: రూ.227 వద్ద కొనండి, టార్గెట్ రూ.238, స్టాప్ లాస్ రూ.222.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ): రూ.857 వద్ద కొనండి, టార్గెట్ రూ.890, స్టాప్ లాస్ రూ.834
అఫెల్ ఇండియా: రూ.1410 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1450, స్టాప్ లాస్ రూ.1375
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం