Stock Market Today: స్టాక్ మార్కెట్లు మరింత పైకి.. 98 పాయింట్ల లాభంలో నిఫ్టీ-stock markets opening nifty sensex trading in green today december 01 top gainers top losers list ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Markets Opening Nifty Sensex Trading In Green Today December 01 Top Gainers Top Losers List

Stock Market Today: స్టాక్ మార్కెట్లు మరింత పైకి.. 98 పాయింట్ల లాభంలో నిఫ్టీ

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 01, 2022 09:19 AM IST

Stock Market Today: భారత స్టాక్ మార్కెట్లు నేడు కూడా లాభాలతో మొదలయ్యాయి. అమెరికా మార్కెట్ల సానుకూలతతో మరింత పైకి వెళుతున్నాయి.

Stock Market Today: స్టాక్ మార్కెట్లు మరింత పైకి..
Stock Market Today: స్టాక్ మార్కెట్లు మరింత పైకి..

Stock Market Opening Today: దేశీయ స్టాక్ మార్కెట్లలో జోష్ కొనసాగుతోంది. అమెరికా మార్కెట్ల సానుకూల ప్రభావం తోడవటంతో నేడు (డిసెంబర్ 1) కూడా భారత ఈక్విటీ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. దేశీయ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 98.20 పాయింట్లు పెరిగి 18,856.55 వద్ద ట్రేడవుతోంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 348.79 పాయింట్లు బలపడి 63,448.20 వద్ద ట్రేడవుతోంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను దూకుడుగా పెంచబోదని ఆ బ్యాంక్ చైర్మన్ పావెల్ చెప్పటంతో అమెరికా, ఆసియా మార్కెట్లు కూడా నేడు పాజిటివ్‍గా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్

గురువారం మార్కెట్ సెషన్ ప్రారంభంలో కాన్‍ఫోర్జ్ లిమిటెడ్, బిర్లా సాఫ్ట్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, ఎల్ అండ్ టీ టెక్నాలజీ, టెక్ మహీంద్రా స్టాక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఓపెనింగ్‍లో నష్టాలను చవిచూసిన శ్రీరామ్ ట్రాన్స్, బజాజ్ ఆటో, టోరెంట్ ఫార్మా, హెచ్‍యూఎల్, హీరో మోటో కార్ప్, యునైటెడ్ స్పిరిట్ స్టాక్స్ ఉదయం టాప్ లూజర్లుగా ట్రేడవుతున్నాయి.

Pre-Market Session: ప్రీ-మార్కెట్ సెషన్‍లో నిఫ్టీ 113.60 పాయింట్లు పెరిగి.. 18,871 పాయింట్లకు చేరింది. సెన్సెక్స్ 258.34 పాయింట్లు బలపడి 63,357 పాయింట్లుగా ఉంది.

భారీ లాభాల్లో అమెరికా మార్కెట్లు

US Markets: వడ్డీ రేట్ల పెంపు దూకుడుగా ఉండదని ఫెడ్ చైర్మన్ జెరోన్ పావెల్ సంకేతాలు ఇవ్వడంతో అమెరికా స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా లాభపడ్డాయి. నాస్‍డాక్ కంపోజైట్ ఏకంగా 484.22 పాయింట్లు పెరిగి.. 11,468.78కు చేరింది. ఎస్&పీ 500.. 122 పాయింట్లు బలపడి 4,080కు చేరింది. డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 737.24 పాయింట్ల భారీ లాభాన్ని సాధించి.. 34,589.77 పాయింట్ల వద్ద స్థిరపడింది.

ఆసియా మార్కెట్లు

అమెరికా సూచీల జోష్‍తో ఆసియా మార్కెట్లు కూడా నేడు (డిసెంబర్ 1) లాభాలతో మొదలయ్యాయి. జపాన్ సూచీ నిక్కీ 1.13 శాతం పెరిగింది. టోపిక్స్ బలపడింది. సౌత్ కొరియా కోస్పీతో పాటు ఆస్ట్రేలియా మార్కెట్ కూడ లాభాలతో ట్రేడవుతున్నాయి.

ఇన్‍స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల తీరిలా..

భారత స్టాక్ మార్కెట్లలో బుధవారం కూడా ఫారిన్ ఇన్‍స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (FIIs) రూ.9,010.14 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. మరోవైపు డొమెస్టిక్ ఇన్‍స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (DIIs) రూ.4,056.40 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారని ఎన్ఈఎస్ డేటా పేర్కొంది.

డాలర్‍తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ.81.16 వద్ద ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‍లో క్రూడ్ అయిల్ మళ్లీ పెరుగుతోంది.

WhatsApp channel