భారత్- పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందం, అమెరికా- చైనా వాణిజ్య యుద్ధానికి బ్రేక్ వంటి సానుకూల పరిణామాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్ని అత్యంత భారీ లాభాలతో ముగించాయి. మంగళవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 2975 పాయింట్లు పెరిగి 82,430 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 917 పాయింట్లు వృద్ధిచెంది 24,925 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 1788 పాయింట్లు పెరిగి 55,383 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1246.48 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,448.37 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
మే నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 9103.7 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 15,189.82 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ని నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 120 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“24,350 ఎగువన ఉండేంతవరకు నిఫ్టీ50లో పాజిటివ్ సెంటిమెంట్ కొనసాగుతుంది. బై ఆన్ డిప్స్ని అనుసరించవచ్చు. 25,350 వద్ద రెసిస్టెన్స్ ఉంది. అది దాటితే సూచీ 25,700 వరకు కూడా వెళ్లొచ్చు,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
యూఎస్ చైనా ట్రేడ్ వార్కి బ్రేక్ పడటంతో సోమవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 2.81 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 3.26శాతం వృద్ధిచెందిది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 4.35 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఇండియా గ్లైకోల్స్- బై రూ. 1555, స్టాప్ లాస్ రూ. 1500, టార్గెట్ రూ. 1600
ఇన్నోవా క్యాప్టాప్- బై రూ. 942.5, స్టాప్ లాస్ రూ. 905, టార్గెట్ రూ. 1010
ఎస్బీఐ- బై రూ. 800, స్టాప్ లాస్ రూ. 765, టార్గెట్ రూ. 840
సైయంట్- బై రూ. 1260, స్టాప్ లాస్ రూ. 1200, టార్గెట్ రూ. 1350
అపోలో టైర్స్- బై రూ. 481, స్టాప్ లాస్ రూ. 470, టార్గెట్ రూ. 510
క్యాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీస్: రూ.1944.40 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.2080, స్టాప్ లాస్ రూ.1876;
కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ కంపెనీ: రూ.124.33 వద్ద కొనండి, టార్గెట్ రూ.133, స్టాప్ లాస్ రూ.120;
గ్లోబల్ హెల్త్: రూ.1227.10 వద్ద కొనండి, టార్గెట్ రూ.1313, స్టాప్ లాస్ రూ.1184;
జేఎం ఫైనాన్షియల్: రూ.105.80 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.114, స్టాప్ లాస్ రూ.102;
పీఎన్సీ ఇన్ఫ్రాటెక్: రూ.259 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.280, స్టాప్ లాస్ రూ.249.
సంబంధిత కథనం