ట్రేడర్స్​ అలర్ట్​- ఈ బ్రేకౌట్స్​ స్టాక్స్​ ట్రాక్​ చేస్తే లాభాలకు ఛాన్స్​!-stock market updates stocks to buy today 30th april 2025 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ట్రేడర్స్​ అలర్ట్​- ఈ బ్రేకౌట్స్​ స్టాక్స్​ ట్రాక్​ చేస్తే లాభాలకు ఛాన్స్​!

ట్రేడర్స్​ అలర్ట్​- ఈ బ్రేకౌట్స్​ స్టాక్స్​ ట్రాక్​ చేస్తే లాభాలకు ఛాన్స్​!

Sharath Chitturi HT Telugu

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

మంగళవార ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు ఫ్లాట్​గా ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 70 పాయింట్లు పెరిగి 80,288 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 7 పాయింట్లు వృద్ధిచెంది 24,336 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 42 పాయింట్లు పడి 55,391 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2,385.61 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,369.19 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఏప్రిల్​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 2,684.46 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 25,067.11 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50లో షార్ట్​ టర్మ్​లో కన్సాలిడేషన్​ కనిపించవచ్చు. 24,550 ఎగువన సూచీ క్లోజ్​ అవ్వాలి. అప్పుడే బ్రేకౌట్​ లభిస్తుంది. 24,250 దగ్గర సపోర్ట్​ కనిపిస్తోంది. దానికన్నా దిగువకు పడితే అమ్మకాల ఒత్తిడికి గురవ్వొచ్చు,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్​ సీనియర్​ టెక్నికల్​ఎనలిస్ట్​ రూపక్​ దే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.75 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.58శాతం వృద్ధిచెందిది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.55 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్​- బై రూ. 4610, స్టాప్​ లాస్​ రూ. 4433, టార్గెట్​ రూ. 4930

పంజాబ్​ కెమికల్స్​ అండ్​ కార్ప్​ ప్రొటెక్షన్​- బై రూ. 1080, స్టాప్​ లాస్​ రూ. 1040, టార్గెట్​ రూ. 1160

బీఈఎంఎల్​- బై రూ. 315, స్టాప్​ లాస్​ రూ. 3150, టార్గెట్​ రూ. 3350

ఇన్ఫోసిస్​- బై రూ. 1495, స్టాప్​ లాస్​ రూ. 1465, టార్గె్​ రూ. 1535

త్రివేణి ఇంజినీరింగ్​ అండ్​ ఇండస్ట్రీస్​- బై రూ. 418, స్టాప్​ లాస్​ రూ. 408, టార్గెట్​ రూ. 435

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

ఆస్పిన్ వాల్ అండ్ కంపెనీ: రూ.284.75 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.305, స్టాప్ లాస్ రూ.275;

డేటా ప్యాటర్న్స్ (ఇండియా): రూ.2556.9 వద్ద కొనండి, టార్గెట్ రూ.2750, స్టాప్ లాస్ రూ.2460;

సరళ పెర్ఫార్మెన్స్ ఫైబర్స్: రూ.107.6 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.115, స్టాప్ లాస్ రూ.103.5;

కిలిచ్ డ్రగ్స్ (ఇండియా): రూ.400.9 వద్ద కొనండి, టార్గెట్ రూ.430, స్టాప్ లాస్ రూ.385;

గిలాండర్స్ అర్బుత్నాట్ అండ్ కో: రూ.117.46 వద్ద కొనండి, టార్గెట్ రూ.125, స్టాప్ లాస్ రూ.113.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం