టాటా మోటార్స్​ స్టాక్​ అలర్ట్​! షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..-stock market updates stocks to buy today 29th april 2025 sgx nifty live ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  టాటా మోటార్స్​ స్టాక్​ అలర్ట్​! షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..

టాటా మోటార్స్​ స్టాక్​ అలర్ట్​! షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఇదే..

Sharath Chitturi HT Telugu

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1006 పాయింట్లు పెరిగి 80,218 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 289 పాయింట్లు మెరుగుపడి 24,328 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 769 పాయింట్లు పెరిగి 55,433 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2,474.1 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2817.64 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఏప్రిల్​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 298.85 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 25,067.11 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 24,400 దాటితే ఇప్పటివరకు ఉన్న షార్ట్​ టర్మ్​ బేరిష్​ పాటర్న్​ రివర్స్​ అవుతుంది. అక్కడి నుంచి నిఫ్టీ50 24,600- 24,800 వరకు వెళ్లొచ్చు. 24,050 వద్ద సపోర్ట్​ ఉంది,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ సీనియర్​ టెక్నికల్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.28 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.06శాతం వృద్ధిచెందిది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.01 శాతం పడింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

టూరిజం ఫైనాన్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా- బై రూ. 198.4, స్టాప్​ లాస్​ రూ. 191, టార్గెట్​ రూ. 212

పరాదీప్​ ఫాస్ఫేట్​ లిమిటెడ్​- బై రూ. 148.9, స్టాప్​ లాస్​ రూ. 144, టార్గెట్​ రూ. 159

టాటా మోటార్స్​- బై రూ. 668, స్టాప్​ లాస్​ రూ. 655, టార్గెట్​ రూ. 685

టాటా స్టీల్​- బై రూ. 142, స్టాప్​ లాస్​ రూ. 135, టార్గెట్​ రూ. 153

ఆదిత్య బిర్లా క్యాపిటల్​- బై రూ. 199, స్టాప్​ లాస్​ రూ. 194, టార్గెట్​ రూ. 207

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

డీసీబీ బ్యాంక్: రూ.139.45 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.149, స్టాప్ లాస్ రూ.135;

పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్: రూ.1143.75 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1234, స్టాప్ లాస్ రూ.1100;

గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ & ఇంజిన్లు: రూ .1749.6 వద్ద కొనండి, టార్గెట్ రూ .1900, స్టాప్ లాస్ రూ .1690;

మనోరమ ఇండస్ట్రీస్: రూ.1294 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1400, స్టాప్ లాస్ రూ.1250;

కైన్స్ టెక్నాలజీ ఇండియా: రూ.5884.6 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.6300, స్టాప్ లాస్ రూ.5660.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం