సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 452 పాయింట్లు పడి 83,606 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 121 పాయింట్లు పతనమై 25,517 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 131 పాయింట్లు పడి 57,313 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 787.62 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,383.01 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 షార్ట్ టర్మ్‌లో కన్సాలిడేట్ అవ్వొచ్చు. 25,500 దిగువకు పడితే కరెక్షన్ కనిపించవచ్చు. 25,6000 25,800 వద్ద రెసిస్టెన్స్ ఎదురవ్వొచ్చు,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ రూపక్ డే తెలిపారు.
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.63 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.52శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.48 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
తమిళనాడు పెట్రోప్రాడక్ట్స్- బై రూ. 102.94, స్టాప్ లాస్ రూ. 99, టార్గెట్ రూ. 110
దీపక్ ఫర్టిలైజర్స్ అండ్ పెట్రో కెమికల్స్- బై రూ. 1707.4, స్టాప్ లాస్ రూ. 1650, టార్గెట్ రూ. 1818
ఎల్ఐసీ- బై రూ. 973, స్టాప్ లాస్ రూ. 945, టార్గెట్ రూ. 1000
భారత్ ఫోర్జ్- బై రూ. 1310, స్టాప్ లాస్ రూ. 1285, టర్గెట్ రూ. 1345
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ- బై రూ. 658, స్టాప్ లస్ రూ. 642, టార్గెట్ రూ. 685
చమన్ లాల్ సేటియా ఎక్స్‌పోర్ట్స్: రూ.381.65 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.410, స్టాప్ లాస్ రూ.368;
డీబీ కార్ప్: రూ .284.65 వద్ద కొనుగోలు, లక్ష్యం రూ .305, స్టాప్ నష్టం రూ .274;
జమ్మూ కాశ్మీర్ బ్యాంక్: రూ .115.85 వద్ద కొనుగోలు, లక్ష్యం రూ .125, స్టాప్ లాస్ రూ .111;
కరూర్ వైశ్యా బ్యాంక్: రూ.267.55 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ. 275, స్టాప్ లాస్ రూ.258;
హబ్టౌన్: రూ.269.05 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.288, స్టాప్ లాస్ రూ.259
సంబంధిత కథనం