Stock market : ఈ రోజు స్టాక్​ మార్కెట్​ ఓపెనింగ్​ ఎలా ఉండబోతోంది? ఏ స్టాక్స్​లో ట్రేడ్​ బెస్ట్​?-stock market updates and stocks to buy today list 17th march 2025 sensex nifty and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market : ఈ రోజు స్టాక్​ మార్కెట్​ ఓపెనింగ్​ ఎలా ఉండబోతోంది? ఏ స్టాక్స్​లో ట్రేడ్​ బెస్ట్​?

Stock market : ఈ రోజు స్టాక్​ మార్కెట్​ ఓపెనింగ్​ ఎలా ఉండబోతోంది? ఏ స్టాక్స్​లో ట్రేడ్​ బెస్ట్​?

Sharath Chitturi HT Telugu

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

హోలీ కారణంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లకు శుక్రవారం సెలవు. ఇక సెన్సెక్స్​, నిఫ్టీలు గురువారం ట్రేడింగ్​ సెషన్​​ని ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 201 పాయింట్లు పడి 73,829 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 73 పాయింట్లు కోల్పోయి 22,397 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 3 పాయింట్లు వృద్ధిచెంది 48,060 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 792.9 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1723.82 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

మార్చ్​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు రూ. 21,231.25 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 26,450.36 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 125 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50కి 22650 కీలక బ్రేకౌట్​ జోన్​గా ఉంది. ఇక్కడ బ్రేకౌట్​ అయితే, నిఫ్టీ50 22,800-22,900 వరకు వెళ్లొచ్చు. అదే 22,300 దిగువకు పడితే అమ్మకాల ఒత్తిడి పెరగొచ్చు. 22,100-22,000 లెవల్స్​ వరకు వెళ్లొచ్చు,” అని కొటాక్​ సెక్యూరిటీస్​ వీపీ- టెక్నికల్​ రీసెర్చ్​ అమోల్​ అథవాలే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 1.6 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 2.1శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 2.6 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

డీమార్ట్​- బై రూ. 3797.10, స్టాప్​ లాస్​ రూ. 3664, టార్గెట్​ రూ. 4063

ఆర్కియన్​ కెమికల్​ ఇండస్ట్రీస్​- బై రూ. 570, స్టాప్​ లాస్​ రూ. 550, టార్గెట్​ రూ. 610

దివిస్​ ల్యాబ్​- బై రూ. 5615, స్టాప్​ లాస్​ రూ. 5550, టార్గెట్​ రూ. 5750

సన్​ ఫార్మా- బై రూ. 1685, స్టాప్​ లాస్​ రూ. 1640, టార్గెట్​ రూ. 1720

ఐటీసీ- బై రూ. 411, స్టాప్​ లాస్​ రూ. 405, టార్గెట్​ రూ. 420

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్: రూ.127.66 వద్ద కొనండి, టార్గెట్ రూ.137, నష్టం రూ.123;

ఆవాస్ ఫైనాన్షియర్స్: రూ.1872.45 వద్ద కొనండి, టార్గెట్ రూ.2000, స్టాప్ లాస్ రూ.1800;

స్వరాజ్ ఇంజిన్స్​: రూ.3158.95 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.3390, స్టాప్ లాస్ రూ.3030;

గోద్రెజ్ ఇండస్ట్రీస్: రూ.1149.05 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1250, స్టాప్ లాస్ రూ.1100;

అవంతి ఫీడ్స్: రూ.842.55 వద్ద కొనండి, టార్గెట్ రూ.900, స్టాప్ లాస్ రూ.810.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం