ఇజ్రాయెల్- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 511 పాయింట్లు పడి 81,897 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 140 పాయింట్లు పతనమై 24,972 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 193 పాయింట్లు పడి 56,059 వద్దకు చేరింది.
సోమవారం అర్థరాత్రి మధ్యప్రాచ్యంలో కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనతో ముడి చమురు అతి భారీగా పతనమైంది. ఫలితంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు ర్యాలీ అవుతున్నాయి.
అయితే, తాము ఎలాంటి కాల్పుల విరమణకు ఒప్పుకోలేదని ఇరాన్ చెబుతోంది. కానీ ఇజ్రాయెల్ తమ మీద దాడి చేయకపోతే, తాము కూడా ఏం చేయమని స్పష్టం చేసింది. ఈ మాటలు ఉద్రిక్తతలు తగ్గించే విధంగా ఉండటం సానుకూల విషయం.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1977.06 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,228.50 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 180 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“24,850 లెవల్స్ పైన ఉన్నంత వరకు నిఫ్టీ50లో కొనుగోళ్ల జోరు కనిపించవచ్చు. 25,000 బ్రేక్ అయితే, 25,350 వరకు వెళ్లొచ్చు,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ ఎలిస్ట్ రూపక్ దే తెలిపారు.
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.89 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.96శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.94 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగవారం ట్రేడింగ్ సెషన్లో భారీ లాభాల్లో దూసుకెళుతున్నాయి. జపాన్ నిక్కీ 1.6శాతం పెరిగింది.
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణపై ట్రంప్ చేసిన ప్రకటనతో ముడి చమురు భారీగా పతనమైంది. 3.78శాతం పడి బ్యారెల్‌కి 68.78 డాలర్లకు చేరింది. జూన్ 11 తర్వాత ఇదే కనిష్ఠ ధర.
బీఈఎల్- బై రూ. 420.9, స్టాప్ లాస్ రూ. 406, టార్గెట్ రూ. 452
మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్- బై రూ. 1599.9, స్టాప్ లాస్ రూ. 1540, టార్గెట్ రూ. 1712
పేటీఎం- బై రూ. 883, స్టాప్ లాస్ రూ. 860, టార్గెట్ రూ. 910
యాక్సిస్ బ్యాంక్- బై రూ. 1212, స్టాప్ లాస్ రూ. 1190, టార్గెట్ రూ. 1250
అలెంబిక్ ఫార్మా- బై రూ. 938, స్టాప్ లాస్ రూ. 910, టార్గెట్ రూ. 970
సంబంధిత కథనం