అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్ పిడుగుతో సోమవారం ట్రేడింగ్ సెషన్లో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 2227 పాయింట్లు పడి 73,138 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 743 పాయింట్లు కోల్పోయి 22,162 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 1643 పాయింట్లు పడి 49,860 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 9,040.01 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 12,122.45 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ని భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 400 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
బ్లాక్ మండే తర్వాత దేశీయ సూచీలు బేర్స్ చేతుల్లోకి వెళ్లినట్టు నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో ప్యానిక్ సెల్లింగ్ కొనసాగితే నిఫ్టీ50 21,400- 21,100 లెవల్స్ వరకు వెళ్లొచ్చని సూచిస్తున్నారు. 22,800 లెవల్స్ దాటితే మార్కెట్లో సెంటిమెంట్ మారినట్టు అర్థం చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కాగా ఇమీడియెట్ సపోర్ట్ 21,900 దగ్గర, రెసిస్టెన్స్ 22,300 దగ్గర ఉందని చెబుతున్నారు.
సోమవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. డౌ జోన్స్ 0.91 శాతం పడింది. ఎస్ అండ్ పీ 500 0.23శాతం పతనమైంది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.10 శాతం పెరిగింది.
ట్రంప్ టారీఫ్ భయాలు, ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి వంటి కారణాలతో అమెరికా స్టాక్ మార్కెట్లు గత కొన్ని రోజులుగా పడుతూనే ఉన్నాయి. సోమవారం కూడా పతనమై చివరికి స్వల్పంగా కోలుకున్నాయి.
సోమవారం కనిపించిన రక్తపాతం అనంతరం ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
360 వన్ వామ్: రూ.886.55 వద్ద కొనండి, టార్గెట్ రూ.949, స్టాప్ లాస్ రూ.855;
వేదాంత్ ఫ్యాషన్స్: రూ.785.80 వద్ద కొనండి, టార్గెట్ రూ.841, స్టాప్ లాస్ రూ.758;
ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్: రూ.141.63 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.152, స్టాప్ లాస్ రూ.136;
జీఆర్ఎం ఓవర్సీస్: రూ.303.6, టార్గెట్ రూ.325, స్టాప్ లాస్ రూ.292;
ఓరియంట్ సిమెంట్: రూ.350.75, టార్గెట్ రూ.375, స్టాప్ లాస్ రూ.337.
సంబంధిత కథనం