Stock market today: ‘బడ్జెట్' ఎఫెక్ట్- తీవ్ర ఒడుదొడుకుల మధ్య సెన్సెక్స్ అప్.. నిఫ్టీ డౌన్
Stock market today : బడ్జెట్ రోజున తీవ్ర ఒడుదొడుకల సెషన్లో స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ స్వల్పంగా లాభపడగా.. నిఫ్టీ నష్టపోయింది.
Stock market today : 'బడ్జెట్ 2023' ఎఫెక్ట్‌తో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో తీవ్ర ఒడుదొడుకులకు గురయ్యాయి. చివరికి ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్.. 158 పాయింట్లు పెరిగి 59,708 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 46 పాయింట్ల నష్టంతో 17,616 వద్దకు చేరింది.
ఆద్యంతం ఒడుదొడుకులే..
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్‌ను లాభాల్లోనే ప్రారంభించాయి. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.. ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టగా.. మధ్యాహ్నం 1 గంట సమయంలో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. కానీ అతి తక్కువ సమయంలోనే భారీ లాభాలు ఆవిరైపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోకి జారుకున్నాయి. కాస్త తేరుకున్న సెన్సెక్స్.. స్వల్ప లాభాల్లో సెషన్‌ను ముగించింది. నిఫ్టీ మాత్రం నష్టాల నుంచి తేరుకోలేకపోయింది.
Budget effect on Stock markets : బుధవారం ట్రేడింగ్ సెషన్లో 60,001 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ.. 60,773 వద్ద ఇంట్రాడే హైని నమోదు చేసింది. ఆ తర్వాత.. 58,817 వద్ద ఇంట్రాడే లోని తాకింది. ఇక 17,812 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ.. 17,972 వద్ద ఇంట్రాడే హైని తాకింది. 17,353 వద్ద ఇంట్రాడే లోని టచ్ చేసింది.
సెక్టార్ల వారీగా లాభాలు- నష్టాలు..
ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ షేర్లు లాభపడ్డాయి.
Stock market today live : అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇన్ష్యురెన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టపోయాయి.
మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్, చమురు- గ్యాస్, విద్యుత్ సెక్టార్లు 1-5శాతం వరకు పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్- స్మాల్‌క్యాప్ సూచీలు 1శాతం పడ్డాయి.
Budget 2023 live updates : ఇన్ష్యురెన్స్ స్టాక్స్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి కనిపించింది. రూ. 5లక్షలు ప్రిమియం దాటితే బీమా ప్రక్రియ కోసం పన్నులు చెల్లించాలని నిర్మలా సీతారామన్ చెప్పడం ఇందుకు కారణం.
ఇక బడ్జెట్ అంటే అధిక ఫోకస్ ఉండే ఐటీసీ స్టాక్.. ఇంట్రాడే సెషన్లో 6.5శాతం వరకు పడింది. ఎంపిక చేసిన సిగరెట్లపై నేషనల్ కలామిటీ కంటీజెంట్ డ్యూటీని పెంచుతున్నట్టు కేంద్రమంత్రి ప్రకటించిన కొద్ది క్షణాల్లో ఈ ఫాల్ కనిపించింది. ఆ ట్యాక్స్ అనేది మార్కెట్ అంచనాల కన్నా తక్కువ ఉండటంతే.. మళ్లీ పుంజుకున్న ఐటీసీ స్టాక్.. 2శాతం లాభాల్లో ముగిసింది.
Stock Market news today : పీఎంఏవై ఓట్లేలో 66శాతం పెంపు ఉండటంతో రియాల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిమెంట్ స్టాక్స్ పెరిగాయి. అర్బన్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఫండ్‌కు ప్రతియేటా రూ. 10వేల కోట్ల నిధులను కేటాయించనున్నట్టు కేంద్రం చెప్పడం ఇందుకు కారణం..
భారత సరిహద్దు, రాజకీయాల్లో అత్యంత కీలకమైన రక్షణ విభాగానికి సంబంధించి కేంద్రమంత్రి ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో.. డిఫెన్స్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
ITC Share price : ఆదాయపు పన్ను మినహాయింపును పెంచుతున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో.. ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్, కన్జ్యూమర్ సెక్టార్ స్టాక్స్ పుంజుకున్నాయి.
గత ఆర్థిక ఏడాదితో పోల్చుకుంటే.. ఈసారి ఫర్టిలైజర్ సబ్సీడీకి కేటాయిస్తున్న నిధులను కేంద్రం తగ్గించడంతో సంబంధిత సెక్టార్ స్టాక్స్ నష్టపోయాయి.
సంబంధిత కథనం