Stock market today : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ను ఫ్లాట్‌గా ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 3 పాయింట్లు తగ్గి 60,504 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 6పాయింట్ల లాభంతో 17,770 వద్ద ట్రేడ్ అవుతోంది.,ఐటీ, మెటల్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తడి కారణంగా సోమవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 335 పాయింట్లు కోల్పోయి 60,507 వద్ద ముగిసింది. నిఫ్టీ50.. 0.5శాతం నష్టంతో 17,765 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ 0.75శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.49శాతం పతనమయ్యాయి. ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ను సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 60510- 17790 వద్ద మొదలుపెట్టాయి.,స్టాక్స్ టు బై..Stocks to buy : ఏషియన్ పెయింట్స్:- :- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 2698, టార్గెట్ రూ. 2860హెచ్డీఎఫ్సీ ఏఎంసీ:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 1859, టార్గెట్ రూ. 2010బజాజ్ ఫినాన్స్:- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 5900, టార్గెట్ రూ. 6,300- రూ. 6,500HDFC share price target : హెచ్డీఎఫ్సీ :- బై కరెంట్ మార్కెట్ ప్రైజ్, స్టాప్ లాస్ రూ. 2645, టార్గెట్ రూ. 2775పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.,లాభాలు.. నష్టాలు..అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్టీ, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, నెస్లే షేర్లు లాభాల్లో ఉన్నాయి.,టాటా స్టీల్, ఇన్ఫీ, సన్‌ఫార్మా, టైటాన్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.,అంతర్జాతీయ మార్కెట్లు..US Stock market investment in Telugu : వడ్డీ రేట్లను తగ్గించే విషయంలో ఫెడ్ ఇంకాస్త ఎక్కువ సమయం తీసుకుంటుందని మదుపర్లలో భయాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో.. అమెరికా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ను స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.1శాతం, ఎస్ అండ్ పీ 500 0.6శాతం, నాస్డాక్ 1శాతం మేర నష్టపోయాయి.,ఆసియా మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ 200 0.1శాతం పతనమైంది. జపాన్ నిక్కీ 0.34శాతం, సౌత్ కొరియా కాస్పి 0.27శాతం పెరిగాయి.,త్రైమాసిక ఫలితాలు..Bharti Airtel Q3 results : భారతీ ఎయిర్టెల్, హిరో మోటోకార్ప్, అంబుజా సిమెంట్స్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎన్డీటీవీతో పాటు ఇతర సంస్థల త్రైమాసిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి.,ఎఫ్ఐఐలు.. డీఐఐలు..సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1218.14కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1203.9 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.,