stock market today: స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 478 పాయింట్లు పెరిగి 58,113 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 138 పాయింట్లు పెరిగి 17,114 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.,Top gainer stocks: టాప్ గెయినర్స్ జాబితా ఇదేటాప్ గెయినర్స్ జాబితాలో ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, విప్రో, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ తదితర స్టాక్స్ ఉన్నాయి.,Top loser stocks: టాప్ లూజర్స్ జాబితా ఇదేటాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఎయిర్ టెల్, సన్ ఫార్మా, టీసీఎస్, టైటాన్ కంపెనీ తదితర స్టాక్స్ ఉన్నాయి.,నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ ఫిన్ సర్వ్, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ రియాల్టీ, నిఫ్టీ ఎనర్జీ తదితర రంగాల సూచీలు లాభాల్లో కదులుతున్నాయి. నిఫ్టీ మీడియా సెక్టార్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి.,Pre-market opening session: ప్రి మార్కెట్ ఓపెనింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 403 పాయింట్లు పెరిగి 58,038 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 126 పాయింట్లు పెరిగి 17,111 పాయింట్ల వద్ద స్థిరపడింది.,నిన్న కూడా లాభాల్లోదేశీయ కీలక సూచీలు గురువారం సానుకూలంగా స్థిరపడ్డాయి. ఐదు రోజుల నష్టాల అనంతరం లాభాలతో ముగిశాయి.,బిఎస్‌ఇ సెన్సెక్స్ చాలా ఒడిదుడుకుల తర్వాత 78 పాయింట్లు పెరిగి చివరకు 57,634.84 వద్ద స్థిరపడగా, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 16,985.60 వద్ద 17,000 స్థాయికి దిగువన ముగిసింది.