Stock market today : ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 10 పాయింట్ల లాస్​-stock market today 13 february 2023 sensex and nifty opens on a flat note ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market Today 13 February 2023 Sensex And Nifty Opens On A Flat Note

Stock market today : ఫ్లాట్​గా దేశీయ సూచీలు.. నిఫ్టీకి 10 పాయింట్ల లాస్​

Sharath Chitturi HT Telugu
Feb 13, 2023 09:17 AM IST

Stock market today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ఉన్నాయి. అమెరికా మార్కెట్​లు నష్టపోయాయి. ఆసియా మార్కెట్​లు నష్టాల్లో ఉన్నాయి.

స్టాక్​ మార్కెట్​ ఇండియా
స్టాక్​ మార్కెట్​ ఇండియా (REUTERS)

Stock market today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 7 పాయింట్లు కోల్పోయి 60,675 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 12పాయింట్ల నష్టంతో 17,844 వద్ద ట్రేడ్​ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 123 పాయింట్ల నష్టంతో 60,682 వద్ద స్థిరపడింది. 36 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 17,856 వద్దకు చేరింది. ఇక 5 పాయింట్లు పెరిగిన బ్యాంక్​ నిఫ్టీ.. 41,559 వద్ద ముగిసింది. ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ను సెన్సెక్స్​, నిఫ్టీలు వరుసగా 60,653- 17,859 వద్ద మొదలుపెట్టాయి.

స్టాక్స్​ టు బై..

LT share price target : ఎల్​టీ:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 2125, టార్గెట్​ రూ. 2200- రూ. 2225

HDFC bank share price target : హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1625, టార్గెట్​ రూ. 1690- రూ. 1710

సుమిటోమో కెమికల్​ ఇండియా (సుమికెమ్​):- బై రూ. 450, స్టాప్​ లాస్​ రూ. 435, టార్గెట్​ రూ. 475

ఐజీఎల్​:- బై రూ. 442, స్టాప్​ లాస్​ రూ. 425, టార్గెట్​ రూ. 470.

లాభాలు.. నష్టాలు..

ఎం అండ్​ ఎం, ఇండస్​ఇండ్​, ఏషియన్​ పెయింట్స్​, ఐటీసీ, టీసీఎస్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

నెస్లే, ఇన్ఫీ, ఎన్​టీపీసీ, సన్​ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్​లు..

US Stock market investment tips in telugu : శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ముగిసింది. డౌ జోన్స్​ 0.5శాతం, ఎస్​ అండ్​ పీ 500 0.22శాతం పెరిగాయి. నాస్​డాక్​ 0.61శాతం పడింది.

ఆసియా మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. జపాన్​ నిక్కీ 0.5శాతం పతనమైంది. సౌత్​ కొరియా కాస్పి 0.3శాతం నష్టపోయింది.

త్రైమాసిక ఫలితాలు..

Nykaa Q3 results : నైకా, జీ ఎంటర్​టైన్​మెంట్​, పవర్​ ఫినాన్స్​ కార్పొరేషన్​, సన్​ ఫార్మా అడ్వాన్స్​డ్​ రీసెర్చ్​ కంపెనీ, శ్రీ రేణుకా షుగర్స్​, సెయిల్​, బజాజ్​ హెల్త్​కేర్​, బజాజ్​ హిందుస్థాన్​ షుగర్​, బీఎఫ్​ యుటిలిటీస్​, బీజీఆర్​ ఎనర్జీ సిస్టెమ్స్​, గ్రిండ్​వెల్​ నార్టన్​తో పాటు మరిన్ని సంస్థ త్రైమాసిక ఫలితాలు వెలువడనున్నాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

దేశీయ స్టాక్​ మార్కెట్​ శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1458.02కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే డీఐఐలు రూ. 291.34కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

WhatsApp channel