Stock market today: ఫ్లాట్‌గా సూచీలు.. సెన్సెక్స్ 20 పాయింట్లు అప్-stock market today 09 march 2023 know performance of sensex nifty top gainers and losers
Telugu News  /  Business  /  Stock Market Today 09 March 2023 Know Performance Of Sensex Nifty Top Gainers And Losers
బుధవారం లాభాల్లో ముగిసిన నిఫ్టీ సూచీ
బుధవారం లాభాల్లో ముగిసిన నిఫ్టీ సూచీ (PTI)

Stock market today: ఫ్లాట్‌గా సూచీలు.. సెన్సెక్స్ 20 పాయింట్లు అప్

09 March 2023, 9:19 ISTHT Telugu Desk
09 March 2023, 9:19 IST

Stock market today: స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి.

Stock market today: స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఆరంభంలో 11 పాయింట్లు నష్టపోయి 60,336 పాయింట్ల వద్ద ట్రేడయింది. తరువాత పుంజుకుంది. నిఫ్టీ 6  పాయింట్లు లాభపడి 17,760 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

Top gainer stocks: టాప్ గెయినర్స్ జాబితా ఇదే

టాప్ గెయినర్స్ జాబితాలో  టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్, లార్సెన్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, కోటక్ మహీంద్రా, విప్రో, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ తదితర స్టాక్స్ ఉన్నాయి.

Top loser stocks: టాప్ లూజర్స్ జాబితా ఇదే

టాప్ లూజర్స్ జాబితాలో రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, నెస్లే, సన్ ఫార్మా, ఎస్‌బీఐ తదితర స్టాక్స్ ఉన్నాయి.

Pre-market opening session: ప్రి మార్కెట్ ఓపెనింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 119 పాయింట్లు లాభపడి 60,467 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 17.65 పాయింట్లు  లాభపడి 17,772 పాయింట్ల వద్ద స్థిరపడింది.

నిన్న బుధవారం స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ 123 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ 43 పాయింట్ల లాభంతో ముగిసింది.

రూపాయి విలువ అమెరికా కరెన్సీతో రూపాయి మారకం విలువ బుధవారం 3 పైసలు క్షీణించి 81.95 వద్ద ముగిసింది. మార్చి 21-22, 2023లో జరగనున్న ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) సమావేశంలో 50-బీపీఎస్ మేర వడ్డీ రేటు పెంపు ఉంటుందన్న ఆందోళనల మధ్య డాలర్ ఇండెక్స్ బలపడిందని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి డాలరుతో పోలిస్తే 82.25 వద్ద ప్రారంభమైంది. 81.95 వద్ద ముగిసింది.