Stock market timings : స్టాక్​ మార్కెట్​ టైమింగ్స్​లో మార్పులు! రాత్రి 11:55 వరకు ట్రేడింగ్​?-stock market timings change nse ceo ashish kumar chauhan says working on it ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market Timings Change Nse Ceo Ashish Kumar Chauhan Says Working On It

Stock market timings : స్టాక్​ మార్కెట్​ టైమింగ్స్​లో మార్పులు! రాత్రి 11:55 వరకు ట్రేడింగ్​?

Sharath Chitturi HT Telugu
Feb 14, 2023 10:38 AM IST

Stock market timings change : ఇండియాలో స్టాక్​ మార్కెట్​ టైమింగ్స్​ మారనున్నాయా? రాత్రి 11:55 వరకు ట్రేడింగ్​ కార్యకలాపాలు చేసుకోవచ్చా?

స్టాక్​ మార్కెట్​ టైమింగ్స్​ మారనున్నాయా?
స్టాక్​ మార్కెట్​ టైమింగ్స్​ మారనున్నాయా?

Stock market timings change India : ఇండియా స్టాక్​ మార్కెట్​ టైమింగ్స్​ మార్పులపై గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పుడు మరో వార్త బయటకొచ్చింది. రాత్రి 11:55 వరకు డెరివేటివ్స్​లో ట్రేడింగ్​ చేసుకునేందుకు విలుగా.. టైమింగ్స్​లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి.. ఎన్​ఎస్​ఈ సీఈఓ ఆశిష్​కుమార్​ చౌహాన్​ చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు దలాల్​ స్ట్రీట్​లో హాట్​టాపిక్​గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు

స్టాక్​ మార్కెట్​ టైమింగ్స్​ ఇలా..

ఇండియా స్టాక్​ మార్కెట్​ టైమింగ్స్​..​ ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 3:30. ఉదయం 9 నుంచి 9:15 వరకు ప్రీ- మార్కెట్​ సెషన్​ నడుస్తుంది. 9:15 నుంచి ట్రేడింగ్​ యాక్టివిటీ మొదలవుతుంది. అంటే.. 6 గంటల 15 నిమిషాల పాటు స్టాక్​ మార్కెట్​ కార్యకలాపాలు సాగించుకోవచ్చు.

Stock market timings : ఇక ఇప్పుడు స్టాక్​ మార్కెట్​ టైమింగ్స్​లో మార్పులు చోటుచేసుకునే అవకాశలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై ఎన్​ఎస్​ఈ సీఈఓ ఆశిష్​కుమర్​ చౌహాన్​.. ఇటీవలే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

"ప్రస్తుతం మార్కెట్​లు 9 నుంచి 3:30 వరకు ఓపెన్​ అయ్యి ఉంటాయి. టైమింగ్స్​ని సాయంత్రం 5 గంటల వరకు ఎక్స్​టెండ్​ చేసుకోవచ్చని సెబీ అనుమతిచ్చింది. ఇక డెరివేటివ్స్​ ట్రేడింగ్​ను ఉదయం 9 నుంచి రాత్రి 11:55 వరకు సాగించుకోవచ్చని చెప్పింది. దీనిపై మేము కసరత్తు చేస్తున్నాము. మా సభ్యులతో కలిసి మార్కెట్​ వర్గాల నుంచి ఈ విషయంపై ఫీడ్​బ్యాక్​ తీసుకుంటున్నాము," అని ఎన్​ఎస్​ఈ సీఈఓ ఆశిష్​కుమార్​ తెలిపారు.

India Stock market news : ఇటీవలే జరిగిన ఇన్​వెస్టర్​ కాల్​లో.. ఎన్​ఎస్​ఈ ఐపీఓపై మాట్లాడారు ఆశిష్​కుమార్​. సెబీ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే స్టాక్​ మార్కెట్​ టైమింగ్స్​ పొడగింపు విషయాన్ని ప్రస్తావించారు.

స్టాక్​ మార్కెట్​ టైమింగ్స్​లో మార్పుల అంశం ప్రస్తుతం ఆలోచన దశలోనే ఉంది. దీనికి ఇంకాస్త కసరత్తు చేయాల్సి ఉంది. ఆ తర్వాతే అధికారులు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఒక వేళ టైమింగ్స్​ను మార్చాలని అనుకుంటే.. ఆ నిర్ణయం అమల్లోకి రావడానికి ఇంకాస్త సమయమే పట్టొచ్చు అని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

ట్రేడర్లపై ప్రభావం ఎంత..?

ఇలా స్టాక్​ మార్కెట్​ టైమింగ్స్​ని పెంచితే లాభాలు, నష్టాలు.. రెండూ ఉన్నాయని దలాల్​ స్ట్రీట్​ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. టైమింగ్స్​ని పెంచితే.. పొద్దున్న ఆఫీసులకు వెళ్లే వారు.. సాయంత్రం ఇంటికి వచ్చి ట్రేడింగ్​ చేసుకుని, అదనంగా ఆదాయాన్ని సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ రెగ్యులర్​ ట్రేడర్లకు మాత్రం ఇబ్బందులు తప్పకపోవచ్చు!

Stock market news today : "స్టాక్​ మార్కెట్​లో ట్రేడింగ్​ అంటే అంత సులభమైనది కాదు. ముఖ్యంగా ఫుల్​టైమ్​ ట్రేడర్లు, ఇన్​వెస్టర్లు.. మార్కెట్​పై ఎక్కువ ఫోకస్​ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడున్న 6 గంటల్లోనే బిజీబిజీగా ఉంటారు. ఇక స్టాక్​ మార్కెట్​ టైమింగ్స్​ని పెంచింతే స్క్రీన్​ టైమ్​ పెరిగిపోతుంది. మధ్యాహ్నం 3:30 తర్వాత కూడా ఒత్తిడి ఉంటుంది. కుటుంబసభ్యులతో సమయం గడపడం కష్టమవుతుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. స్టాక్​ మార్కెట్​ టైమింగ్స్​లో మార్పులు జరిగితే.. వాల్యూమ్​లు కూడా మారుతాయి. ఫలితంగా ట్రేడర్లు తమ స్ట్రాటజీలను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద విషయం," అని స్టాక్​ మార్కెట్​ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

WhatsApp channel