ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ఐదేళ్లలో 12000 శాతానికి పైగా రాబడి.. ఇప్పుడు మరో గుడ్‌న్యూస్!
Multibagger Stock : కొన్ని స్టాక్స్ దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇస్తాయి. అలాంటివాటిలో సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ కూడా ఒకటి. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ఐదేళ్లలో 12000 శాతానికిపైగా రాబడి ఇచ్చింది.
కొన్నేళ్లుగా కొన్ని కంపెనీలు భారీ రాబడులు ఇవ్వడం ద్వారా ఇన్వెస్టర్లను ధనవంతులను చేశాయి. వాటిలో సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ కూడా ఒకటి. ఐదేళ్లలో కంపెనీ షేరు ధర 12182 శాతం పెరిగింది. ఈ కంపెనీకి సంబంధించి మరో శుభవార్త కూడా తాజాగా వచ్చింది. అది ఏంటంటే ఈ సంస్థ భాగస్వామ్యం ద్వారా జర్మనీలో ఓ భారీ ప్రాజెక్టును నిర్మించబోతోంది. సోలార్ ఉత్పత్తులు, ఈవీ ఛార్జర్లు, డీసీ చార్జర్లు, హోమ్ ఏసీ ఛార్జర్లలో సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ సేవలు అందిస్తోంది. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌తో ఈ స్టాక్‌కు మరింత బూస్ట్ వస్తుందని అనుకుంటున్నారు.
కొత్త ప్రాజెక్ట్ ఏంటి?
ఎక్స్ఛేంజీకి ఇచ్చిన సమాచారంలో ఎల్ఈఎస్జీ జీఎంబీహెచ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది. 100 శాతం సౌరశక్తితో నడిచే ఈవీ ఛార్జింగ్ వ్యవస్థలను జర్మనీలో కంపెనీ తయారు చేయనుంది. సర్వోటెక్ అందించిన సమాచారం ప్రకారం, ఈ ఛార్జింగ్ స్టేషన్ ద్వారా ఇ-బైక్స్, ఇ-స్కూటర్లు, ఇ-కార్గో బైక్స్‌ను ఛార్జ్ చేసే అవకాశం ఉంది. ఈ స్టేషన్‌లో ఒకేసారి 4 ద్విచక్ర వాహనాలను ఛార్జ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది.
మరోవైపు సోమవారం సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ షేర్లు 4 శాతం పెరిగాయి. ఈ స్మాల్ క్యాప్ షేరు లాభంతో రూ.183.60 వద్ద ప్రారంభమైంది. కంపెనీ షేరు ధర 4 శాతం పెరిగి రూ.189.67 వద్ద ముగిసింది. కంపెనీ రికార్డు గరిష్ట స్థాయి రూ.205.40కి చాలా దగ్గరగా ఉంది. సెప్టెంబర్ 26న కంపెనీ షేర్లు ఈ స్థాయిలో ఉన్నాయి.
గత ఏడాది కాలంలో కంపెనీ షేరు ధరలు 142 శాతం పెరిగాయి. అదే సమయంలో మూడేళ్ల పాటు స్టాక్ ను కలిగి ఉన్న ఇన్వెస్టర్లు ఇప్పటివరకు 43.24 శాతం లాభాన్ని పొందారు. కంపెనీ 52 వారాల కనిష్ట స్థాయి రూ.73గా ఉంది. అదే సమయంలో మార్కెట్ క్యాప్ రూ.4157.39 కోట్లుగా ఉంది. ఈ కంపెనీ ఎన్ఎస్ఈలో లిస్ట్ అయింది.
గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. స్టాక్ పనితీరు గురించి మాత్రమే. స్టాక్ మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉంటుంది. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించండి.