Stock Market : పడిపోయిన ఎస్బీఐ షేర్లు.. కానీ ఇప్పుడు కొంటే భవిష్యత్తులో లాభాలు అంటున్న నిపుణులు-stock market sbi share crash 6 percent what next target prices details inside sbi share target price ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market : పడిపోయిన ఎస్బీఐ షేర్లు.. కానీ ఇప్పుడు కొంటే భవిష్యత్తులో లాభాలు అంటున్న నిపుణులు

Stock Market : పడిపోయిన ఎస్బీఐ షేర్లు.. కానీ ఇప్పుడు కొంటే భవిష్యత్తులో లాభాలు అంటున్న నిపుణులు

Anand Sai HT Telugu

SBI Shares : స్టాక్ మార్కెట్‌ల క్రాష్ తర్వాత.. ట్రేడింగ్ చేసేవారికి ఎలాంటి స్టాక్ కొనాలో అని భయం ఉంటుంది. అయితే ఎస్‌బీఐ బ్యాంకు షేరు కూడా పతనం అయ్యాయి. కానీ ఈ షేర్లు భవిష్యత్తులో లాభాలను తీసుకొస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఎస్బీఐ షేర్లు

మార్కెట్లో గందరగోళం మధ్య దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) షేర్లు కూడా వారంలో మొదటి ట్రేడింగ్ రోజున దారుణంగా పతనమయ్యాయి. సోమవారం బ్యాంక్ షేరు ధర 6 శాతం క్షీణించి రూ.800 వద్ద ముగిసింది. ఈ షేరు ఇంట్రాడేలో రూ.831.40 వద్ద గరిష్టాన్ని తాకింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి షేరు ధర 4.34 శాతం క్షీణించి రూ.811.10 వద్ద ముగిసింది. 2024 జూన్ 3న ఈ షేరు ధర రూ.912.10కి చేరింది. ఈ షేరు 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే ఈ బ్యాంక్ షేరు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎస్బీఐ షేరు ధర రూ.1,025 వరకు ఉండొచ్చని ఎంకే గ్లోబల్ తెలిపింది. దీంతో పాటు స్టాక్ పై పందెం వేయాలని బ్రోకరేజీ సంస్థ సూచించింది. అదే సమయంలో ఎస్బీఐ టాప్ ఛాయిస్‌గా ఉందని నోమురా ఇండియా తెలిపింది. బ్రోకరేజీ సంస్థ రూ.1,030 టార్గెట్ ఇచ్చింది. గతంలో దీని ధర రూ.1000 ఉండేది. అదేవిధంగా ప్రభుదాస్ లిల్లాధేర్ షేరు టార్గెట్ ధరను రూ.910 నుంచి రూ.960కి పెంచారు.

మరో బ్రోకరేజీ సంస్థ యస్ సెక్యూరిటీస్ షేరుపై 'బై' రేటింగ్‌తో రూ.1,035 టార్గెట్ ధరను కలిగి ఉంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ కూడా ఎస్బీఐ టార్గెట్‌ను రూ.980 నుంచి రూ.1,000కు పెంచింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఎస్బీఐ నికర లాభం 4.25 శాతం పెరిగి రూ.19,325 కోట్లకు చేరింది. బ్యాంక్ ప్రధాన వడ్డీ ఆదాయం 5.71 శాతం పెరిగి రూ.41,125 కోట్లకు చేరింది. బ్యాంకు ఇతర ఆదాయం జూన్ త్రైమాసికంలో రూ.12,063 కోట్ల నుంచి రూ.11,162 కోట్లకు తగ్గింది. జూన్ త్రైమాసికంలో బ్యాంక్ డిపాజిట్ల వృద్ధి 8 శాతంగా ఉంది.

జూన్ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.1,08,039 కోట్ల నుంచి రూ.1,22,688 కోట్లకు పెరిగిందని ఎస్బీఐ తెలిపింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్ వడ్డీ ఆదాయం రూ.95,975 కోట్ల నుంచి రూ.1,11,526 కోట్లకు పెరిగింది.

గమనిక : ఇది కేవలం నిపుణుల అభిప్రాయం మాత్రమే. పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది. పెట్టుబడిదారులు నిపుణుల సలహా కచ్చితంగా తీసుకోవాలి.