డిఫెన్స్ స్టాక్స్ మాత్రమే కాదు.. రైల్వే స్టాక్స్ కూడా దూసుకెళ్తున్నాయి.. మే నెలలో పైపైకి!-stock market railway stocks rally in may should you buy irctc railtel irfc rites and others ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  డిఫెన్స్ స్టాక్స్ మాత్రమే కాదు.. రైల్వే స్టాక్స్ కూడా దూసుకెళ్తున్నాయి.. మే నెలలో పైపైకి!

డిఫెన్స్ స్టాక్స్ మాత్రమే కాదు.. రైల్వే స్టాక్స్ కూడా దూసుకెళ్తున్నాయి.. మే నెలలో పైపైకి!

Anand Sai HT Telugu

గత కొన్ని రోజుల్లో రైల్వే స్టాక్స్ మంచి పనితీరు కనబరిచాయి. మే నెలలో చూసుకుంటే రాబడిలో దూసుకెళ్లాయి.

రైల్వే స్టాక్స్

భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన తర్వాత మార్కెట్లో రక్షణ రంగ స్టాక్స్ బలపడటం ప్రారంభించాయి. రక్షణ రంగ స్టాక్‌ల మాదిరిగానే రైల్వే స్టాక్‌లు కూడా పెరుగుతున్నాయి. దీనికి ముందు రైల్వే స్టాక్స్ పనితీరు తక్కువగా ఉంది. ఇప్పుడు రైల్ వికాస్ నిగమ్, ఆర్ఐటీఈఎస్, బీఈఎంఎల్, ఐఆర్‌సీటీసీ, రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ షేర్లు మే నెలలో మంచి రాబడిని ఇచ్చాయి.

రైల్వే స్టాక్‌లు మే 2023 నుండి జూలై 2024 వరకు నిరంతరం పెరిగాయి. కానీ ఆ తర్వాత ఈ స్టాక్‌లు రికార్డు గరిష్టాల నుండి అటుఇటుగా వెళ్లాయి. కానీ ఇటీవల ఆర్డర్ పెరగడం వల్ల రైల్వే స్టాక్‌లపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది. రక్షణ రంగ స్టాక్స్‌లో నిరంతర పెరుగుదలతో పాటు, రైల్వే స్టాక్‌లు కూడా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించడం ప్రారంభించాయి.

రైల్‌టెల్ షేర్లు

మే నెలలో రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్లు రూ.312 నుంచి రూ.396కి పెరిగాయి. జనవరి 2024 తర్వాత ఇది అతిపెద్ద నెలవారీ పెరుగుదల. మే ప్రారంభంలో రైల్‌టెల్ నార్త్ సెంట్రల్ రైల్వే నుండి రూ.227.5 మిలియన్ల విలువైన వర్క్ ఆర్డర్‌ను అందుకుంది. 2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసిక ఫలితాల ప్రకారం, ఇది రూ. 113.4 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. గత ఏడాది ఇది 77.53 కోట్లు. 2025 ఆర్థిక సంవత్సరంలో రైల్‌టెల్ షేర్లు 27.6 శాతానికిపైగా లాభపడ్డాయి.

ఆర్ఐటీఈఎస్ షేర్లు

ప్రముఖ రవాణా మౌలిక సదుపాయాల కన్సల్టెన్సీ, ఇంజనీరింగ్ సంస్థ అయిన ఆర్ఐటీఈఎస్, దాని అద్భుతమైన పనితీరుతో పురోగతి సాధిస్తోంది. ఈ స్టాక్స్ మే నెలలో 27 శాతం వరకు లాభపడ్డాయి. 2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో కంపెనీ రూ.1,418 కోట్ల కంటే ఎక్కువ విలువైన 150 కి పైగా ఆర్డర్‌లను పొందింది.

ఇర్కాన్ ఇంటర్నేషనల్

మే నెలలో ఇర్కాన్ ఇంటర్నేషనల్ షేర్లు 23 శాతం వరకు పెరిగాయి. మే 6న కంపెనీకి కేరళ రాష్ట్ర ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నుండి రూ.1.87 బిలియన్ల ఆర్డర్ వచ్చింది. అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్‌లోని టాటో-I జలవిద్యుత్ ప్రాజెక్టు సివిల్ పనుల కోసం నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ నుండి రూ.458.14 కోట్ల విలువైన కాంట్రాక్టును గెలుచుకుంది.

రైల్ వికాస్ నిగమ్

రైల్ వికాస్ నిగమ్ షేర్లు మే నెలలో 17 శాతం వరకు రాబడిని ఇచ్చాయి. శుక్రవారం ఆ కంపెనీకి సెంట్రల్ రైల్వేస్ నుంచి రూ.116 కోట్ల ఆర్డర్ వచ్చింది. ఇది స్టాక్ వృద్ధికి దోహదపడింది.

ఐఆర్ఎఫ్‌సీ

ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్ఎఫ్‌సీ) షేర్ ధర మే నెలలో 12 శాతం పెరిగింది. మే 15న ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలలో డీప్-డిస్కౌంట్ బాండ్ల ద్వారా రూ.100 బిలియన్ల వరకు సేకరించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

బీఈఎంఎల్, ఐఆర్‌సీటీసీ వంటి ఇతర రైల్వే సంబంధిత ప్రభుత్వ రంగ స్టాక్‌లు కూడా మే నెలలో వరుసగా లాభపడ్డాయి. రైల్వే స్టాక్‌లపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది.

గమనిక : ఇది పెట్టుబడి సలహా కాదు. కేవలం స్టాక్ పనితీరు మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.