Stock Market News: వరుస సెషన్లలో భారీగా నష్టాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు (మార్చి 15, బుధవారం) లాభాలతో మొదలయ్యాయి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) సూచీ నిఫ్టీ 151.70 పాయింట్లు బలపడి 17,195 వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ 507.42 పాయింట్లు పెరిగి 58,407.61 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా మార్కెట్లు మంగళవారం సెషన్‍లో భారీగా పుంజుకున్నాయి. దీంతో నేడు ఆసియా మార్కెట్లు కూడా లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. దీంతో భారత మార్కెట్లపై సానుకూల ప్రభావం పడింది.,టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్సెషన్ ఓపెనింగ్‍లో ఆదానీ ఎంటర్‌ప్రైజెస్, ఐఈఎక్స్, వోల్టాస్, ఐడీఎఫ్‍సీ ఫస్ట్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ స్టాక్స్ లాభపడి టాప్ గెయినర్లుగా ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్, ఎస్‍బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, గోద్రెజ్ కంజ్యూమర్, కోల్గేట్, సన్ ఫార్మా స్టాక్స్ టాప్ లూజర్లుగా సెషన్‍ను మొదలుపెట్టాయి.,సెషన్ ఆరంభంలో బ్యాంకింగ్, మెటల్, ఆటో, ఐటీ రంగ స్టాక్‍లు ఎక్కువ లాభాల్లో ఉన్నాయి.,లాభపడ్డ అమెరికా మార్కెట్లుద్రవ్యోల్బణం డేటా అంచనాలు తగ్గట్టే ఉండడం, బ్యాంకింగ్ సంక్షోభం సద్దుమణుగుతుందన్న అంచనాలతో అమెరికా మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. మంగళవారం సెషన్‍లో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 336.26 పాయింట్ల పెరిగి 32,155.4 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్&పీ 500 సూచీ 64.80 పాయింట్లు బలపడి 3,920.56 వద్ద స్థిరపడింది. నాస్‍డాక్ కంపోజైట్ 239.31 పాయింట్లు పైకి ఎగిసి 11,428.15కు చేరింది.,ఆసియా మార్కెట్లుఅమెరికా మార్కెట్లలో సానుకూలతతో ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా నేడు లాభాలతో ఓపెన్ అయ్యాయి. ఆస్ట్రేలియా సూచీ గ్రీన్‍లో ట్రేడ్ అవుతోంది. జపాన్‍లో నిక్కీ, టాపిక్స్ సుమారు 1 శాతం లాభపడ్డాయి. దక్షిణ కొరియాలో కోస్పీ ప్రస్తుతం 1.36 శాతం లాభంతో ట్రేడ్ అవుతోంది.,80 డాలర్ల దిగువకు క్రూడ్అంతర్జాతీయ మార్కెట్‍లో క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయాయి. దీంతో మరోసారి 80 డాలర్ల దిగువకు బారెల్ క్రూడ్ ఆయిల్ చేరింది. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ బారెల్ ధర 78.44 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభంపై ఆందోళన తగ్గడం డాలర్ విలువ కూడా పుంజుకుంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.30 వద్ద ఉంది.