Stock market opening: స్వల్ప లాభాలతో ప్రారంభమై.. ఫ్లాట్ గా మారిన స్టాక్ మార్కెట్స్; యూఎస్ ఫెడ్ పై అందరి దృష్టి
Stock market opening: భారతీయ స్టాక్ మార్కెట్లలో బుధవారం ఉదయం స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభమైంది. కానీ, కాసేపటికే నష్టాల బాట పట్టింది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లపై ఈ రోజు నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగేస్తున్నారు.
Stock market opening: బుధవారం ఉదయం బెంచ్ మార్క్ ఇండెక్సెస్ స్వల్పంగా పడిపోయాయి. ముఖ్యంగా యూఎస్ ఫెడ్ (US Fed) వడ్డీ రేట్లపై ఈ రోజు నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో.. ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారు.
Sensex, Nifty: సెన్సెక్స్, నిఫ్టీ..
బీఎస్ఈ సెన్సెక్స్ బుధవారం ఉదయం సెషన్ లో 75.11పాయింట్లను కోల్పోయి, 63,068.05. పాయింట్లకు చేరింది. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 9.6 పాయింట్లు కోల్పోయి 18,706.55 పాయింట్లకు చేరింది. సెన్సెక్స్ లోని 30 షేర్లలో ఇండస్ఇండ్ బ్యాంక్, భారతి ఎయిర్ టెల్, బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ మహింద్ర, ఇన్ఫోసిస్, హెచ్ యూఎల్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, ఎల్ అండ్ టీ నష్టాలలో కొనసాగుతున్నాయి. మరోవైపు, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, ఐటీసీ, నెస్లె, అల్ట్రా టెక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు..
ఆసియాలోని ఇతర మార్కెట్లలో.. సియోల్, హాంకాంగ్ మార్కెట్లు నష్టాల్లో, టోక్యో, షాంఘై మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు సానుకూల ఫలితాలతో ముగిశాయి. ముడి చమురు విషయానికి వస్తే, బుధవారం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర0.09% పెరిగి 74.36 డాలర్లకు చేరింది. మంగళవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 1,677.60 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేశారు. మంగళవారం సెన్సెక్స్ 418.45 పాయింట్లు పెరిగి 63,143.16 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 మంగళవారం ట్రేడింగ్ లో 114.65 పాయింట్లు బలపడి 18,716.15 పాయింట్ల వద్ద స్థిరపడింది.