Stock market news: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 144 డౌన్
Stock market news today 17th October 2022: స్టాక్ మార్కెట్లు నేడు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
Stock market news today 17th October 2022: స్టాక్ మార్కెట్లు నేడు సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 128.30 పాయింట్లు నష్టపోయి 57,791 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 42.30 పాయింట్లు నష్టపోయి 17,143 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
Top gainer stocks: టాప్ గెయినర్స్ జాబితా ఇదే
టాప్ గెయినర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ సుజుకీ, పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాాంక్, సన్ ఫార్మా, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్, డాక్టర్ రెడ్డీస్ తదితర స్టాక్స్ ఉన్నాయి.
Top loser stocks: టాప్ లూజర్స్ జాబితా ఇదే
టాప్ లూజర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీద్రా, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, విప్రో, భారతీ ఎయిర్ టెల్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్ తదితర స్టాక్స్ ఉన్నాయి.
Pre-market opening session: ప్రి మార్కెట్ ఓపెనింగ్ సెషన్‌లో సెన్సెక్స్ 167.47 పాయింట్లు నష్టపోయి 57,752 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 40.90 పాయింట్లు నష్టపోయి 17,144 పాయింట్ల వద్ద స్థిరపడింది.
లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో ర్యాలీతో పాటు ఇన్ఫోసిస్, బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్స్‌లో భారీ కొనుగోళ్లతో ఈక్విటీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం లాభపడ్డాయి.
ఇంట్రా-డేలో దాదాపు 1,200 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ 684.64 పాయింట్ల లాభంతో 57,919.97 వద్ద ముగిసింది. నిఫ్టీ 171.35 పాయింట్లు పెరిగి 17,185.70 వద్ద ముగిసింది.
దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ. 6,021 కోట్లకు చేరడంతో ఇన్ఫోసిస్ షేర్లు శుక్రవారం 3.82 శాతం పెరిగాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రో, బజాజ్ ఫైనాన్స్ తదితర స్టాక్స్ శుక్రవారం బాగా లాభపడ్డాయి.
Rupee fall: రూపాయి పతనం
ఓవర్సీస్‌లో డాలర్, క్రూడాయిల్ ధరలు స్థిరంగా ఉండడం కారణంగా శుక్రవారం రూపాయి ఇంట్రా-డే నష్టాలను తగ్గించుకుని యూఎస్ డాలర్‌తో పోలిస్తే 5 పైసలు పెరిగి 82.19 వద్ద ముగిసింది.
Oil Prices: ఆయిల్ ధరలు ఇలా..
ప్రపంచంలోని అగ్రశ్రేణి ముడి చమురు దిగుమతిదారు చైనాలో డిమాండ్‌ను అంచనా వేయడానికి వీలుగా గణాంకాల కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో అమెరికా డాలర్ బలం తగ్గడంతో సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 85 సెంట్లు పెరిగి 92.48 డాలర్లకు చేరుకుంది. గత వారం 6.4 శాతం పతనమై క్రమంగా కోలుకుంది.