Stock Market Today: మళ్లీ ప్రతికూలత: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు-stock market open in red today nifty sensex trading with losses on march 20 2023 opening session ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Stock Market Open In Red Today Nifty Sensex Trading With Losses On March 20 2023 Opening Session

Stock Market Today: మళ్లీ ప్రతికూలత: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 20, 2023 09:16 AM IST

Stock Market New Today: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నెగెటివ్‍గా ఓపెన్ అయ్యాయి. ఆసియా మార్కెట్లు కూడా నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి.

Stock Market Today: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు..
Stock Market Today: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు..

Stock Market New Today: భారత స్టాక్ మార్కెట్లు నేడు (మార్చి 20, సోమవారం) నష్టాలతో ఓపెన్ అయ్యాయి. అంతర్జాతీయ ఒడిదొడుకుల మధ్య సూచీలు మరోసారి ప్రతికూలతను కనబరుస్తున్నాయి. సెషన్ ఓపెనింగ్‍లో ఎన్ఎస్ఈ నిఫ్టీ (Nifty) 112.75 పాయింట్లు కోల్పోయి 16,987.30 వద్ద ట్రేడ్ అవుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex) 359.21 పాయింట్ల నష్టంతో 57,630.69 వద్ద కొనసాగుతోంది. ఆసియా మార్కెట్లు నేడు నష్టాలతో ట్రేడవుతున్నాయి. అమెరికా బ్యాంకింగ్ సంక్షోభానికి క్రెడిట్‍సూస్ అస్థిరత తోడవడంపై మార్కెట్లపై ప్రభావం చూపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

లాభాలు, నష్టాలు

Stock Market New Today : సెషన్ ఆరంభంలో బయోకాన్, మణప్పురం ఫైనాన్స్, సింజిన్, హెచ్‍డీఎఫ్‍సీ ఏఎంసీ, వొడాఫోన్ ఐడియా, హిందుస్థాన్ పెట్రో, ఐఓసీ స్టాక్స్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, మదర్సన్, ఇండియాబుల్స్ హౌసింగ్ స్టాక్స్ టాప్ లూజర్లుగా ఓపెన్ అయ్యాయి.

అమెరికా మార్కెట్లు

US Markets: బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న తీవ్ర ఆందోళనతో శుక్రవారం సెషన్‍లో అమెరికా మార్కెట్లు నష్టపోయాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 384.57 పాయింట్లు పడిపోయి 31,861.98 వద్ద ముగిసింది. నాస్‍డాక్ కంపోజైట్ సూచీ 86.76 పాయింట్లు పడి రూ.11,630.51 వద్దకు చేరింది. ఎస్‍&పీ 500 ఇండెక్స్ 43.64 పాయింట్లు కోల్పోయి 3,916.64 వద్ద స్థిరపడింది.

ఫైనాన్షియల్ స్టాక్‍లలో అమ్మకాల ఒత్తిడితో ఆసియా మార్కెట్లు నేడు నష్టాలతో కొనసాగుతున్నాయి. జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా మార్కెట్లు రెడ్‍లో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ సూచీ నిక్కీ సుమారు ఒక శాతం నష్టంతో ఉంది.

క్రూడ్ మరింత కిందికి..

Crude Oil Price: అంతర్జాతీయ మార్కెట్‍లో క్రూడ్ ఆయిల్ ధర పతనం కొనసాగుతోంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 72.84 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. క్రూడ్ ఆయిల్ తగ్గుదల భారత ఆయిల్ కంపెనీలకు సానుకూలంగా ఉంటుంది. డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారకం విలువ రూ.82.51 వద్ద ఉంది.

WhatsApp channel